Lovestory: మంగ్లీ పాడిన సారంగ ద‌రియా సాంగ్‌ను రిలీజ్ చేసిన స‌మంత‌..

Lovestory: నాగ‌చైత‌న్య అక్కినేని, సాయిప‌ల్ల‌వి జంట‌గా ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్‌క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఈ చిత్రానికి సంబంధించి ఇప్ప‌టికే పోస్ట‌ర్ల్ ఎంతో అలరించాయి. ఇప్పుడు తాజాగా ప్ర‌ముఖ జాన‌ప‌ద సింగ‌ర్ మంగ్లీ పాడిన ఈ చిత్రం నుంచి సారంగ ద‌రియా పాట‌ను చిత్ర‌బృందం విడుద‌ల చేసింది. ఈ మేర‌కు ఈ సాంగ్‌ను స‌మంత అక్కినేని త‌న ట్విట్ట‌ర్ ద్వారా రిలీజ్ చేసింది.

samantha

Lovestoryదీంట్లో మంగ్లీ పాడిన ఒక ఎత్తు అయితే.. సాయిప‌ల్ల‌వి చేసిన డ్యాన్స్ అంతా ఇంతా కాదు.. ఓ రేంజ్‌లో మెస్మ‌రైజ్ చేసింది సాయిప‌ల్లవి. ఈ పాట‌కు ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ శేఖ‌ర్ మాస్ట‌ర్ నృత్యాలు స‌మ‌కుర్చారు. ఇప్పుడు ఈ పాట యూట్యూబ్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సారంగ ద‌రియా లిరిక్స్ ప్ర‌ముఖ పాట‌ల ర‌చ‌యిత సుద్దాల అశోక్ తేజ అందించారు. ఈ చిత్రానికి ప‌వ‌న్ స్వ‌రాలు అందించ‌గా.. సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ‌వెంక‌టేశ్వ‌ర సినిమాస్‌, అమిగోస్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్లు సంయుక్తంగా Lovestoryఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం స‌రికొత్త ప్రేమ‌క‌థ అంశంతో ఏప్రిల్ 16న ప్రేక్ష‌కుల ముందుకు రానుందిLovestory.