Tollywood: నాగ‌చైత‌న్య‌-సాయిప‌ల్ల‌వి ల‌వ్‌స్టోరి.. రంగంలోకి స‌మంత!

Tollywood: నాగ‌చైత‌న్య అక్కినేని, న్యాచుర‌ల్ బ్యూటీ సాయిప‌ల్ల‌వి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం ల‌వ్‌స్టోరి. ఈ చిత్రానికి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. ఇదివ‌ర‌కే డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల, సాయిప‌ల్ల‌వి కాంబోలో ఫిదా చిత్రం తెర‌కెక్కింది. ఇందులో వ‌రుణ్‌తేజ్‌కు జోడీగా సాయిప‌ల్ల‌వి హీరోయిన్‌గా న‌టించింది. కాగా ఈ చిత్రంలో సాయిప‌ల్ల‌వి న‌ట‌న ప్రేక్ష‌కుల‌ను ఎంతో అల‌రించింది. ఇక ఇప్పుడు వీరి కాంబోలో మ‌రోసారి ప్రేక్ష‌కుల‌ను అలాంటి కాన్సెప్ట్‌తో తెర‌పైకి వ‌స్తున్నారు. ఇందులో Tollywoodనాగ‌చైత‌న్య‌, సాయిప‌ల్ల‌వి మంచి ప్రేమ‌క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు పంచ‌నున్నారు. ఇక ఇప్ప‌టికే Tollywoodఈ చిత్రానికి సంబంధించి పోస్ట‌ర్ల్ ప్రేక్ష‌కుల‌ను ఎంతో ఫిదా చేసింది.

Saipallavi

ఇప్పుడు తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సూప‌ర్ బీట్ సాంగ్ సారంగ ద‌రియాను ఫిబ్ర‌వ‌రి 28న రిలీజ్ చేస్తున్న‌ట్లు పోస్ట‌ర్‌ను రిలీజ్ చేశారు. ఈ సాంగ్‌ను ప్ర‌ముఖ న‌టి అక్కినేని స‌మంత చేతుల మీదుగా రిలీజ్ చేయ‌నున్నారు చిత్ర‌బృందం. ఈ పాట‌ను సుద్దాల అశోక్ తేజ లిరిక్స్ అందించ‌గా.. మంగ్లీ ఈ సాంగ్‌ను ఆల‌పించారు. Tollywoodఈ చిత్రానికి ప్ర‌ముఖ మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఏ ఆర్ రెహ‌మాన్ ద‌గ్గ‌ర ప‌నిచేసిన ప‌వ‌న్ స్వ‌రాలు స‌మ‌కుర్చారు. ప‌వ‌న్ స‌మ‌కూర్చిన‌ సారంగ ద‌రియా పాట‌ను ఫిబ్ర‌వరి 28న ఉద‌యం 10.08గంట‌ల‌కు ఆవిష్క‌రించ‌బోతున్నారు స‌మంత‌.