లవ్ స్టోరీ, టక్ జగదీష్ రిలీజ్ డేట్స్ ఫిక్స్

టాలీవుడ్‌లో సినిమా రిలీజ్ డేట్‌లు వరుసగా వచ్చేస్తున్నాయి. నిర్మాతలు పోటీ పడి మరీ రిలీజ్ డేట్‌లను ప్రకటిస్తున్నారు. గత కొద్దిరోజులుగా వరుస పెట్టి సినిమా రిలీజ్ డేట్‌లు వస్తున్నాయి. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన టక్ జగదీష్, అక్కినేని హీరో నాగచైతన్య హీరోగా వస్తున్న లవ్ స్టోరీ సినిమా రిలీజ్ డేట్‌లు వచ్చేశాయి. టక్ జగదీష్ సినిమాను ఏప్రిల్ 16న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ముందుగా ప్రకటించారు.

love story andf tuck

ఇక అదే రోజున లవ్ స్టోరీ సినిమాను విడుదల చేయనున్నట్లు ఆ సినిమా యూనిట్ ప్రకటించింది. అయితే రెండు సినిమాలు ఒకే రోజు విడుదలైతే థియేటర్లు పరంగా ఇబ్బందులు తలెత్తుతాయనే ఉద్దేశంతో టక్ జగదీష్ సినిమా యూనిట్ ఏప్రిల్ 23కి తమ రిలీజ్ డేట్‌ను మార్చేసింది. ఇక లవ్ స్టోరీ ఏప్రిల్ 16న విడుదల కానుంది.