ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘లవ్ మౌళి’ – ఎప్పటి నుండి అంటే….

100% తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా తిరుగులేని వినోదాన్ని అందించ‌టంలో ఎల్ల‌ప్పుడు ముందుంటుంద‌న‌టంలో సందేహం లేదు. ప్ర‌తీ వారం కొత్త సినిమాలు, సిరీస్‌లు, షోస్‌ను అందిస్తోంది. అందులో భాగంగా న‌వ‌దీప్ లేటెస్ట్ ఫిల్మ్ ‘లవ్ మౌళి’ ఈ లిస్టులో చేరింది. ఈ న్యూ ఏజ్ యూత్ ఫుల్ డ్రామా ఆహాలో ప్రేక్ష‌కుల‌ను జూన్ 27 నుంచి అల‌రించ‌నుంది. అవ‌నీంద్ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రాన్ని సీ స్పేస్‌, నైరా క్రియేష‌న్స్‌, శ్రీక‌ర స్టూడియోస్‌ నిర్మించాయి.  

జూన్ 7న ‘లవ్ మౌళి’ చిత్రం థియేట‌ర్స్‌లో విడుద‌లైంది. ఓ డిఫ‌రెంట్ కంటెంట్‌ను అందించిన విధానం, నేటి జ‌న‌రేష‌న్‌కు క‌నెక్ట్ అయ్యేలా ఉంది. న‌వ‌దీప్ త‌న కెరీర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్‌ను అందించారు. ఆయ‌న‌లోని న‌టుడ్ని 2.0 వెర్ష‌న్‌లో చూపించిన చిత్ర‌మిది. వైవిధ్య‌మైన సినిమాలు చూడాల‌నే ప్రేక్ష‌కులకు ఈ సినిమా త‌ప్ప‌కుండా నచ్చుతుంది.

ఈ అద్భుత‌మైన సినీ ప్ర‌యాణాన్ని వీక్షించే అవ‌కాశాన్ని వ‌దులుకోవ‌ద్దు. జూన్ 27న ఆహాలో ల‌వ్ మౌళి చిత్రాన్ని చూడ‌టానికి సిద్ధం కండి.

న‌టీన‌టులు:

న‌వ‌దీప్‌, పంఖురి గిద్వాని, భావ‌న సాగి, మిర్చి హేమంత్‌, మిర్చి కిర‌ణ్ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌లు:  సీ స్పేస్‌, నైరా క్రియేష‌న్స్‌, శ్రీక‌ర స్టూడియోస్‌

డైరెక్ట‌ర్‌: అవ‌నీంద్ర‌

మ్యూజిక్‌:  గోవింద్ వ‌సంత్‌

బ్యాగ్రౌండ్ స్కోర్‌:  క్రిష్ణ‌

పాట‌లు :  అనంత్ శ్రీరాం

ఆర్ట్‌:  కిర‌ణ్ మామిడి

కొరియోగ్ర‌ఫీ:  అజ‌య్ శివ‌శంక‌ర్‌

కాస్ట్యూమ్స్‌:  అన్షి గుప్తా

డిఐ:  పొయెటిక్ స్టూడియోస్(కొచ్చి)

వి.ఎఫ్‌.ఎక్స్‌:  నాగు

సౌండ్ డిజైన్‌:  ధ్వ‌ని స్టూడియోస్‌