‘ల‌వ్ మాక్‌టైల్ 2’ జెన్యూన్ రివ్యూ

కన్నడ బ్లాక్ బస్టర్ మూవీ నిర్మాత రచయిత దర్శకుడు హీరో డార్లింగ్ కృష్ణ నటించిన లవ్ మోక్టైల్ 2. మిలిన నాగరాజ్, అమృత అయ్యంగర్, రచల్ డేవిడ్, నకుల్ అభయాన్కర్ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సంగీత దర్శకుడు నకుల్ అభయాన్కర్ మంచి మ్యూజిక్ అందించాడు. నేడు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ :

లవ్ మోక్టైల్ కి సీక్వెల్గా వస్తోంది ల‌వ్ మాక్‌టైల్ 2. ఆది భార్య నిధి చనిపోతుంది. ఎప్పుడూ తన భార్య ఆలోచనలతోనే ఉండే ఆది ఆ డిప్రెషన్ నుంచి బయటకు రావడం కోసం అరకు వెళ్తాడు. తనను ఇష్టపడే అమ్మాయిలు తన వెంట పడుతున్న వారిని పట్టించుకోడు. అలా చేస్తున్న క్రమంలో తన భార్య తన పక్కనే ఉంటున్నటుహించుకుంటున్న హీరో కి పెళ్లి చేయాలని చూస్తుంది. చివరికి బంధాలకు, కుటుంబానికి, ప్రేమకి విలువ ఇచ్చే హీరో పెళ్లి చేసుకుంటాడా లేదా? తెలియాలంటే కచ్చితంగా సినిమా చూడాల్సిందే.

నటన :
గతంలో లవ్ మోక్టెల్ తో హిట్టు కొట్టిన డార్లింగ్ కృష్ణ తనే నిర్మాతగా దర్శకుడిగా వ్యవహరిస్తూ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా నటించాడు. రచల్ డేవిడ్, నకుల అభయాన్కర్, అమృత అయ్యంగర్, సుస్మిత గౌడ, అభిలాష్ ఎవరి పాత్రకి వాళ్లు న్యాయం చేశారు. నిధి క్యారెక్టర్ లో మిలిన నాగరాజ్ నటన చాలా బాగుంది.

సాంకేతిక విశ్లేషణ :

నకుల్ నకుల అభయాన్కర్ ఇచ్చిన మ్యూజిక్ అండ్ సాంగ్స్ సినిమాకి హైలైట్. శ్రీ క్రేజీ మైండ్స్ సినిమాటోగ్రఫీ మరియు ఎడిటింగ్ చాలా బాగున్నాయి. మంచి కథ నేర్చుకుని దర్శకత్వ విలువలతో డార్లింగ్ కృష్ణ ఒక మంచి ఫ్యామిలీ లవ్ స్టోరీ ని తీసుకుని వచ్చారు. డబ్బింగ్ సినిమా ల కాకుండా టెక్నికల్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా ఈ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు.

ప్లస్ పాయింట్స్ :

డార్లింగ్ కృష్ణ కథ, నటన
మిగిలిన నాగరాజ్, అభిలాష్, రచల్ డేవిడ్ క్యారెక్టర్స్
నకుల్ అభయాన్కర్ సంగీతం
సెకండ్ హాఫ్ మరియు క్లైమాక్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ ఆఫ్ లో లాగ్ సీన్స్
నవ్వించలేని కామెడీ

యూత్ కి బాగా నాచే సినిమా. యూత్ మిస్ అవ్వకుండా చూడాల్సిన సినిమా.