తెరపై ముగ్గురు నట విరాట్టులు… ఆన్ స్క్రీన్ అద్భుతానికి సిద్ధమవ్వండి

ఖైదీ, మాస్టర్ సినిమాలతో సూపర్ హిట్స్ అందుకున్న దర్శకుడు లోకేష్ కానగరాజ్. తన నెక్స్ట్ సినిమాని లోకనాయకుడు కమల్ హాసన్ తో ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. విక్రమ్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే గ్లిప్స్ వీడియో రిలీజ్ అయ్యి అందరినీ ఆకట్టుకుంది. లోకనాయకుడు కమల్ హాసన్ నటిస్తున్న 232వ సినిమా కాగా ఇందులో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి, మలయాళ సూపర్ స్టార్ ఫాహద్ ఫాజిల్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. మెయిన్ కాస్ట్ ముగ్గురూ ఉన్న ఈ పోస్టర్ కోలీవుడ్ సినీ అభిమనులతో పాటు సౌత్ ఇండియాలోని అన్నీ ఇండస్ట్రీల్లోని సినీ అభిమానులని ఆకట్టుకుంటోంది. లైట్ గా విజయ్ సేతుపతి, మాధవన్ నటించిన విక్రమ్ వేదా పోస్టర్ టైపులో డిజైన్ చేశారు అనిపిస్తోంది. యాక్టింగ్ లో పీక్స్ చూపించే సేతుపతి, కమల్, ఫాహద్ కలిసి ఒక సినిమాలో చేయడం అనేది ఆన్ స్క్రీన్ ఫీస్ట్ అనే చెప్పాలి. 2018లో వచ్చిన విశ్వరూపం 2 తర్వాత కమల్ స్క్రీన్ పైన కనిపించడం ఇదే మొదటిసారి. మక్కల్ మీది మెయ్యం పార్టీకి తమిళనాడులో ఎదురు దెబ్బ తగిలింది. దీంతో కమల్ మళ్లీ పూర్తి స్థాయిలో సినిమాల పై ద్రుష్టి పెట్టె అవకాశం ఉంది.