లైట్స్ కెమెరా యాక్షన్… రానా ర్యాప్ సాంగ్ సూపరో సూపర్

విశాల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ యాక్షన్. సుందర్ సి డైరెక్ట్ చేసిన ఈ సినిమా రేపు రిలీజ్ ఉండడంతో చిత్ర యూనిట్, లాస్ట్ మినిట్ సర్ప్రైజ్ గా దగ్గుబాటి రానాతో పాడించిన సాంగ్ ఫుల్ వెర్షన్ ని రిలీజ్ చేశారు. హిప్ హాప్ తమిళ ఇచ్చిన ట్యూన్ ని రానా వాయిస్ సూపర్ గా సెట్ అయ్యింది. యాక్షన్ మేకింగ్ వీడియోస్ కి ప్యాడింగ్ గా వచ్చిన ఈ సాంగ్ ‘అడుగడుగున పిడుగుల జడి’ అంటూ థ్రిల్లింగ్‌ గా సాగింది.

మొదటి పాటనే ర్యాప్‌ పాడిన రానా, అందరినీ ఫిదా చేశాడు. నిజానికి సాంగ్ వినగానే ఇది రానా వాయిస్ యేనా? ఇంత చేంజ్ ఓవర్ ఎలా సాధ్యం అయ్యింది? గంభీరమైన డైలాగ్స్ పలికే గొంతులో ఇంత సూపర్ సాంగ్ వినిపిస్తుందా అనే అనుమానం వచ్చింది. రానా పాడిన ఈ సాంగ్ సినిమాలో ఉంటుందో లేక ప్రొమోషన్స్ కి మాత్రమే పరిమితం అవుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. ప్రొమోషన్స్ కి మాత్రమే ఈ సాంగ్ వాడుతుంటే, ఈ పాటికి ఎప్పుడు సాంగ్ బయటకి వచ్చేది. రిలీజ్ ముందు వదిలారు అంటే రానా గొంతు థియేటర్ లో కూడా వినొచ్చు. కంప్లీట్ స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ రాబడుతుంది అనేది చూడాలి.