Liger: శివ‌గామితో రౌడీ విజ‌య్ పార్టీ..

Liger: రౌడీ విజ‌య్‌దేవ‌రొండ‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీజ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతున్న చిత్రం లైగ‌ర్‌. ఈ చిత్రాన్ని పూరీ క‌నెక్ట్స్‌, క‌ర‌ణ్ జోహ‌ర్ నిర్మిస్తుండ‌గా.. పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబ‌ర్ 9న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో విజ‌య్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ అన‌న్య పాండే హీరోయిన్‌గా న‌టిస్తోంది. ప్ర‌స్తుతం ఈ చిత్రం షూటింగ్ ద‌శ‌లో ఉంది. అయితే విజ‌య్‌దేవ‌ర‌కొండ లైగ‌ర్ షూటింగ్ అప్‌డేట్స్‌ను త‌న అభిమానుల‌తో పంచుకుంటున్నారు.

ఇటీవ‌లే ముంబైలో Ligerఈ సినిమా షూటింగ్ మొద‌లుకాగా.. లొకేష‌న్‌లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోల‌ను షేర్ చేస్తున్నారు. ఇటీవ‌లే ఛార్మి యాక్టివా పై రౌడీ విజ‌య్ కూర్చొని ముంబై రోడ్ల మీద హ‌ల్‌చ‌ల్ చేశారు. అలాగే ఈ చిత్ర హీరోయిన్ అన‌న్య పాండే, బాలీవుడ్ స్టార్ బ్యూటీ సారా అలీఖాన్‌తో లైగ‌ర్ చిత్ర‌బృందం పార్టీ చేసుకున్నారు. ఆ ఫోటోలు వైర‌ల్ అయ్యాయి. ఇక తాజాగా రౌడీ విజ‌య్ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో వెట‌ర‌న్ న‌టి శివ‌గామి ర‌మ్య‌కృష్ణ‌తో విజ‌య్ ఉన్నారు. ఆ ఫోటోకు క్యాప్ష‌న్.. మంచి కంపెనీ ఉంటే ప‌ని కూడా పార్టీలానే ఉంటుంది అంటూ రాసుకొచ్చాడు విజ‌య్‌. ఇక Ligerఈ సినిమాలో విజ‌య్‌కు త‌ల్లి పాత్ర‌లో ర‌మ్య‌కృష్ణ క‌నిపించ‌నుంది. ఇక ఈ చిత్రం మార్ష‌ల్ ఆర్ట్స్ క‌థాంశంతో తెర‌కెక్కుతుండ‌గా.. లైగ‌ర్ చిత్రానికి సాలా క్రాస్ బ్రీడ్ అనే ట్యాగ్‌లైన్‌.