గాన గంధర్వుడు ‘బాలసుబ్రహ్మణ్యం’ అంత్యక్రియలు పూర్తి..

ఇండియన్ సీనియర్ మోస్ట్ సింగర్ SP బాలసుబ్రహ్మణ్యంకు తమిళనాడు ప్రభుత్వం అధికారిక గౌరవ లాంఛనాలతో కడసారి వీడ్కోలు పలికింది. తామరైపాక్కం ఫామ్ హౌజ్ లో కుటుంబ సబ్యుకు SPB అంత్యక్రియలను పూర్తి చేశారు. ఎస్పీబీకి కడసారి వీడ్కోలు పలికేందుకు చాలా మంది సినీ ప్రముఖులు ఫామ్ హౌజ్ కి వెళ్లారు. నిన్న కొంతమంది ఎంజీఎం హాస్పిటల్ లోనే నివాళులర్పించారు.

ఇక ఈ రోజు ఫామ్ హౌజ్ లో ఉన్న బాలు గారి పార్థివ దేహాన్ని చివరిసారిగా చూసిన సంగీత దర్శకులు గాయకులు సినీ ప్రముఖులు కన్నీటితో కడసారి వీడ్కోలు పలికారు. నిన్న హాస్పిటల్ నుంచి బాలు పార్థివ దేహాన్ని అంబులెన్స్ లో తీసుకువస్తుండగా జనాలు పూల వర్షం కురిపించారు. అభిమానులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇక ఫామ్ హౌజ్ వద్దకు కూడా ఎంతో మంది జనాలు చేరుకున్నప్పటికీ కరోనా ఆంక్షల దృష్ట్యా పోలీసులు ఎవరిని కూడా లోపలికి అనుమతించలేదు. ఇక కుటుంబ సభ్యులు హిందు సాంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు పూర్తి చేశారు.