ఏపీలో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఇప్పటికే ఆయా పార్టీలు తమ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థుల జాబితాలను కూడా విడుదల చేశాయి. ఈ క్రమంలోనే మావోయిస్టు కీలక నేత గణేష్ ఏపీలోని రాజకీయ పార్టీలపై స్పందిస్తూ లేఖాస్త్రాన్ని సంధించారు.
ముఖ్యంగా సినీ హీరో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ స్థాపించిన నాడు తమ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం గల పార్టీ అంటూ పవన్ చెప్పుకొచ్చాడని అన్నారు. కానీ, అతడు ప్రస్తుతం బీజేపీతో పొత్తు పెట్టుకుని రాజకీయం చేస్తున్నాడని ఆరోపించారు. పవన్ కల్యాణ్‌కు స్థిరమైన రాజకీయ విధానం లేదని.. అతడికి విశ్వసనీయత తక్కువ అని అన్నారు. సినీ గ్లామర్, కాపు కులస్థుల గుర్తింపుతో రాజకీయ నిరుద్యోగులకు జనసేన ఒక వేదికగా మారిందని మావోయిస్టు గణేష్ అన్నారు.