K Viswanath Passed Away : బ్రేకింగ్ న్యూస్ – కళాతపస్వి కె. విశ్వనాథ్ ఇకలేరు

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. దివి నుంచి మరో తార భువికి వెళ్ళిపోయింది. ప్రముఖ దర్శకులు, కళాతపస్వి కె. విశ్వనాథ్ (K Viswanath) ఇకలేరు. ఈ రోజు (గురువారం రాత్రి 2-3-2023) ఆయన తుదిశ్వాస విడిచారు.

ప్రస్తుతం కె. విశ్వనాథ్ వయసు 92 ఏళ్ళు. కొన్ని రోజులుగా వయసు రీత్యా వచ్చిన అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. హెల్త్ ఇష్యూస్ సీరియస్ కావడంతో నగరంలోని ప్రముఖ ఆసుపత్రికి తీసుకు వెళ్లారు. కొద్దిసేపటి క్రితం ఆయన మరణించారు.