రెచ్చిపోతున్న లావణ్య త్రిపాఠి.. ఆ యంగ్ హీరోకు ముద్దులే ముద్దులు

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్‌కి పరిచయమైన లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత టాలీవుడ్‌లో వరుస అవకాశాలను దక్కించుకుంది. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు అందరితో నటిస్తోంది. ఇప్పటివరకు టాలీవుడ్‌లో 16 సినిమాల్లో ఆమె నటించగా.. ఆమె నటించిన ఏ1 ఎక్స్‌ప్రెస్, చావు కబురు చల్లగా సినిమాలు విడుదలకు సిద్ధమయ్యాయి. కానీ ఎక్స్‌పోజింగ్, లిప్‌లాక్ సీన్లకు దూరంగా ఉండే లావణ్య త్రిపాఠి.. తొలిసారి ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో రెచ్చిపోయింది.

lavanya tripati lip lock

సందీప్ కిషన్ హీరోగా వస్తున్న ఏ1 ఎక్స్‌ప్రెస్ సినిమాలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో సందీప్‌, లావణ్య మధ్య లిప్ లాక్ సీన్ ఉన్నట్లు తాజాగా విడులైన ట్రైలర్‌ని బట్టి చూస్తే అర్థమవుతోంది. ఇక చావు కబురు చల్లగా సినిమాలో కూడా ఇలాంటి ముద్దు సీన్లు ఉన్నట్లు తెలుస్తోంది.