ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు విజ‌య్‌భాస్క‌ర్ ద‌ర్శ‌క్వంలో ‘ఉషా ప‌రిణ‌యం’ ప్రారంభం !!

తెలుగు సినీ రంగంలో ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న ద‌ర్శ‌కుల్లో ఒక‌రైన కె.విజ‌య్‌భాస్క‌ర్ మ‌ళ్లీ ఓ స‌రికొత్త ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రానికి శ్రీ‌కారం చుట్టాడు. నువ్వేకావాలి, మ‌న్మ‌థుడు, మ‌ల్లీశ్వ‌రి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన ఆయ‌న స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో ఉషా ప‌రిణ‌యం పేరుతో రూపొంద‌నున్న ఈ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ప్రారంబోత్స‌వం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. పూజా కార్య‌క్ర‌మాల అనంత‌రం హీరో, హీరోయిన్ల‌పై స‌న్నివేశాల చిత్రీక‌ర‌ణతో రెగ్యుల‌ర్ షూటింషూటింగ్‌ను మొద‌లుపెట్టారు ద‌ర్శ‌కుడు విజ‌య్‌భాస్క‌ర్‌.

ఉషా ప‌రిణ‌యం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొంద‌నున్న ఈ చిత్రానికి ల‌వ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉప‌శీర్షిక‌. క్రాఫ్ట్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపైకె.విజ‌య్‌భాస్క‌ర్ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌నున్న ఈ చిత్రంలో విజ‌య్‌భాస్క‌ర్ త‌న‌యుడు శ్రీ‌క‌మ‌ల్ హీరోగా న‌టిస్తుండ‌గా, హు ఈజ్‌ ఉషా అంటూ సోషల్‌ మీడియాలో జరిగిన చర్చను తెరదించుతూ తాన్వీ ఆకాంక్ష అనే అచ్చ‌తెలుగ‌మ్మాయి ఈ చిత్రంతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం కాబోతుందనే విషయాన్ని రివీల్‌ చేశారు.

ఈ చిత్రంలో వెన్నెల‌కిషోర్‌, శివాజీ రాజా, ఆమ‌ని, సుధ‌, ఆనంద్ చ‌క్ర‌పాణి, ర‌జిత‌, బాల‌క్రిష్ణ‌, సూర్య, మ‌ధుమ‌ణి ఇత‌ర ప్ర‌ధాన పాత్ర‌లు పోషిస్తున్నారు. కుటుంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ ల‌వ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాకి సంగీతం : ఆర్ ఆర్ ధ్రువ‌న్‌, డీఓపీ: స‌తీష్ ముత్యాల‌, ఎడిటింగ్‌: ఎమ్ ఆర్ వ‌ర్మ‌.