మాతృ దినోత్సం సందర్భంగా “అమ్మే లేని జన్మ” వీడియో ఆల్బమ్ లాంచ్!!

ఈ ప్రపంచంలో వెలకట్టలేనిది ఒక్క తల్లి ప్రేమ మాత్రమే. నవమాసాలు బిడ్డను జాగ్రత్తగా మోసి…ఆ బిడ్డను ప్రపంచానికి పరిచయం చేస్తుంది. అంతేకాదు తన బిడ్డ కోసం ఎన్నో త్యాగాలు చేస్తుంది తల్లి. తల్లి ప్రేమను గురించి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కవులు తమదైన శైలిలో వర్ణించారు. ” ప్రపంచంలోని దేశదేశాల్ని చుట్టి, లక్షలాది మందిని కలిసినా అమ్మ వంటి అపురూప వ్యక్తి ఎక్కడా తారసపడలేదు. నేను సంపాదించిందంతా ఆమె చరణాల వద్ద పోసినా ఇంకా బాకీ పడతాను” అని అమ్మ మీద తనకున్న ప్రేమను చాటుకున్నాడు చార్లీ చాప్లిన్‌ అందుకే చరిత్రలో అమ్మకంటూ ఒక రోజును కేటాయించారు. అందుకే అమ్మ మాధుర్యాన్ని తెలియజేసేలా మాతృ దినోత్సం సందర్భంగా రాజేందర్ స్వరపరచిన పాటకు రవికృష్ణ నటించి ప్రేక్షకులను మెప్పించేందుకు వీడియో రూపంలో నిర్మించిన “అమ్మే లేని జన్మ” ఆల్బమ్ సాంగ్ హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిదిగా వచ్చిన సుందరాంగుడు హీరో సాయి కృష్ణ “అమ్మేలేని ఈ జన్మ ” సాంగ్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో డ్యాన్స్ మాస్టర్ నిక్సన్, డ్యాన్స్ మాస్టర్ సూర్య కిరణ్, పాటల రచయిత, సింగర్ రాజేందర్, డైరెక్టర్ రామారావు, డి.యస్.పి రాందాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా

నటుడు, నిర్మాత రవికృష్ణ మాట్లాడుతూ… ఎంతో మంది హీరోలకు నిక్సన్ సర్ లైఫ్ ఇచ్చాడు వారంతా మంచి పొజిషన్ లో వున్నారు. వారికిచ్చినట్లే నాకు ఈ చిత్రంలో అవకాశం కల్పించారు. నిక్సన్ గారి ఆశీర్వాదంతో వారిలో నేను ఒకరవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నాకే చిత్రంలో నటించే అవకాశం కల్పించిన నిక్సన్ సర్ కు నేను జీవితాంతం ఋణపడి ఉంటాను. అలాగే డి.యస్.పి రాందాస్ గారు గత 10 సంవత్సరాలనుండి నేను ఎక్కడ పడిపోతానో అని గమనిస్తూ నన్ను వేలుపట్టి నడిపిస్తున్నాడు.వారు నాకు జీవితాన్ని ప్రసాదించడం వలనే నేను ఈ రోజు ఇలా స్టేజ్ మీద మాట్లాడు తున్నాను. వారికి నేను నా ఫ్యామిలీ ఋణపడి ఉంటాము. అందుకే నేను ఏది చేసినా వారికి చెప్పకుండా ఏ పని చెయ్యను. ప్రతి మనిషికి అమ్మ అంటే ఎంతో ఇష్టం అమ్మ లేకుంటే జన్మలేదు ఆ జన్మకు ఎదో ఒక అర్థముంటుందని అమ్మ చనిపోతే ఒక కొడుకు ఎంత బాధ పడతాడు అనే విషయాన్ని పాట రూపంలో తెలియజేయడం జరిగింది.ఈ పాటను అందరూ చూసి ఆదరిస్తారని కోరుకొంటున్నాను.ఈ ప్యాండమిక్ స్విచ్ వేషన్ లో కూడా నన్ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.మీ అందరి ఆశీర్వాదాలు నాకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటు న్నాను అని అన్నారు.

సుందరాంగుడు హీరో కృష్ణ సాయి మాట్లాడుతూ .. “అమ్మలేని జన్మ” పాటను సాయి చాలా అద్భుతంగా తీశారు. ఈ పాటలో పిక్చరైజేషన్, లిరిక్స్, మ్యూజిక్, రీ రికార్డింగ్ ఇలా అన్ని విధాలా ప్రతీది అద్బుతంగా సినిమా రేంజ్ లో తీశారు. ఇది సినిమాలో పెట్టుకుంటే ఎలాంటి డౌట్ లేకుండా పెద్ద హిట్ అవుతుంది. ముఖ్యంగా రవి కృష్ణ డ్యాన్స్ మాస్టర్ అయినా ఎంతో ఎక్స్ పీరియన్స్ ఉన్న నటుడిలా ఇందులో ఎంతో అద్బుతంగా నటించాడు. ఇంత ఆవేశంగా, ఇంత ట్రాజిక్ చేస్తాడని అనుకోలేదు రవికి రియల్ గా కంగ్రాట్స్ చెప్పాలి. నా సుంద రాంగుడు సినిమాలో కూడా ఎంతో ఇంపార్టెంట్ అయిన లార్డ్ శివ సాంగ్ ను నాతోపాటు డ్యాన్సర్ గా చాలా చక్కగా చేశాడు. సృష్టి లో అమ్మ చాలా గొప్పది అమ్మ లేకపోతే సృష్టే లేదు మదర్ ఈజ్ అల్వేస్ గ్రేట్ .ఇది రొమాంటిక్ సాంగ్ కాదు ట్రాజెడీ సాంగ్. మన సినిమా ఇండస్ట్రీ లో ట్రాజెడీ సినిమాలు ఎప్పుడూ పెద్ద హిట్టే . దేవదాసు, లైలా మజ్ను, పుట్టింటి గౌరవం , అమ్మ లేని పుట్టిల్లు, మాతృదేవోభవ వంటి ట్రాజెడీ సినిమాలన్నీ ఎంతో పెద్ద హిట్ అయ్యాయి.కాబట్టి ఈ “అమ్మే లేని జన్మ” ఆల్బమ్ సాంగ్ కూడా కచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని అన్నారు.

కొరియోగ్రాఫర్ నిక్సన్ మాస్టర్ మాట్లాడుతూ… ఎంతో మంది హీరోలతో నేను వర్క్ చేశాను. రవిని మాత్రం ఒక డ్యాన్సర్ గా,, హీరోగా కాకుండా ఇంతకాలం బ్రదర్ గానే ట్రీట్ చేశాను. ప్రస్తుతం ఇంటినుండి బయటికి రాని ఈ పరిస్థితుల్లో వున్నా కానీ మేము ఈ ప్రోగ్రాంకు వచ్చామంటే ఒక మంచి వ్యక్తిని చూడడానికి వచ్చాము. అతని మంచితనమే మమ్మల్ని ఇక్కడిదాకా తీసుకువచ్చింది..రవి వెరీ గుడ్ హ్యూమన్ బీయింగ్ పర్సన్. ఇక్కడికి వచ్చాక రవి వర్క్ చూసి నేను ఆశ్చర్యపోయాను తను అమ్మమీద పాడిన పాట నన్ను కలచి వేసింది. ఎందుకంటే 20 సంవత్సరాల నుండి తల్లిదండ్రుల ప్రేమకు దూరమయ్యాను. ఈ పాట చూసిన తరువాత ఐ ఫెల్ట్ దట్ టచ్.మంచి కాన్సెప్ట్ తో ఈ పాటను చేశాడు.రవి వాళ్ళ ఫ్యామిలీ అంటే నాకు బాగా ఇష్టం. ఈ పాట అందరి ప్రేక్షకులకు హార్ట్ టచ్ అయ్యి ఈ పాట అందరికీ రీచ్ అవ్వాలని కోరుతూ..ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇంకా ఎన్నో చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.

డి.యస్.పి రాందాస్ నాయక్ గారు మాట్లాడుతూ..” అమ్మేలేని ఈ జన్మ” సాంగ్ చూస్తుంటే హృదయం బరువెక్కిపోతుంది. మా పేరెంట్స్ గుర్తుకు వచ్చారు. రవి ఆ సీన్ లో నటించినపుడు రవి క్యారెక్టర్ లోకి నేను వెళ్ళిపోయా.. ఆ రోజుల్లో నేను ఏ రకంగా ఫీల్ అయ్యానో అదేరకంగా నా మైండ్ రిపీట్ అయ్యి మరొకసారి మా అమ్మను దగ్గరికి చేర్చినట్లుగా ఉంది. అమ్మ లేకపోతే మనం ఎంత విచిత్ర మైనటువంటి జీవితాన్ని మనం గడపవలసి వస్తుందో అనే విషయాన్ని రవి సాంగ్ రూపంలో చూపించాడు. సాంగ్ లో రవి నటించలేదు జీవించాడని చెప్పడంలో అతిశయోక్తి లేదని మనవి చేసుకొనుచున్నాను. జీవితం చాలా చిన్నది కానీ హార్ట్ ఈజ్ లాంగ్ అనే సందేశాన్ని ఈ పాట ద్వారా ఎంతోమంది కన్నబిడ్డలు తల్లిలేని బిడ్డలున్నారు వారు ఈ సాంగ్ ను చూస్తే తల్లి ఒడిలో చేరిపోయినంత అద్బుతమైనటువంటి ఫీలింగ్స్ లాంటి కళా ఖండాన్ని సృష్టించిన రవి & టీం అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అమ్మ లేని జన్మ అనే వీడియో సాంగ్ లాంచ్ కు వచ్చిన సోదరుడు సాయి కృష్ణ, నిక్సన్, రవిని కన్న తల్లిదండ్రులు అదృష్ట వంతులు అని చెప్పగలను.అమ్మ మీద పాటరాసి తల్లికి మించిన దేవత, దైవంలేదని మరొక సారి రవి ప్రూవ్ చేశాడు.తను ఆ తల్లి రుణం తీర్చుకున్నట్లే లెక్క మేమింకా పెండింగ్ లో ఉన్నాము. ఇలాంటి వాటికి రవి కి సపోర్ట్ గా ఎల్లప్పుడూ ఉంటాము. మనిషికి రెండుకళ్ళు ఎంత ముఖ్యమో మన సృష్టిలో అమ్మ,నాన్న అనేది అంతే ముఖ్యం. కొండంత నాన్న లేకపోతే మనం జీవించ గలం కానీ.. గోరంత దీపం వెలిగించే అమ్మలేకపోతే మనం జీవించలేం జీవితంలో ఎన్నో సాధించగలం గానీ అమ్మ ప్రేమను సాధించలేమని అన్నారు.


నటీనటులు:
రవికృష్ణ, గీత (మదర్ క్యారెక్టర్), పరమేష్, చైల్డ్ ఆర్టిస్ట్స్ లక్ష్మీ మనోజ్ఞ, లక్ష్మీ తనుజ,రూపేందర్ కృష్ణ నాయక్ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
బ్యానర్ :
సమర్పణ : అడ్వకేట్ సత్యవతి,
డైరెక్టర్: రాజు వంగ
నిర్మాత: రూపేందర్ కృష్ణ నాయక్,
కెమెరామెన్: శివ వెలుపుల
సంగీతం: మదీన్ యస్.కె,
లిరిక్స్ & సింగర్స్ : రాజేందర్ కొండ , రాము
డ్యాన్స్ మాస్టర్స్ : నిక్సన్ మాస్టర్, సూర్య కిరణ్ మాస్టర్
సాంగ్ కొరియా గ్రాఫర్ : సూర్య కిరణ్,
డి.ఓ.పి : శివ వెలుపుల
పి ఆర్.ఒ: మూర్తి మల్లాల