నయనతారని ఇలా ఎప్పుడూ చూసి ఉండరు…

డయానా మరియమ్ కురియన్… సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఏలుతున్న ఒక స్టార్ హీరోయిన్ అంటే నమ్ముతారా? నమ్మి తీరాలి ఎందుకంటే డయానా అసలు పేరు నయనతార. సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి నయనతారగా పేరు మార్చుకున్న డయానా, ఇప్పుడు సౌత్ సినిమాని లేడీ సూపర్ గా స్టార్ గా ఏలుతోంది. లేడీ ఓరియెంటెడ్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తున్న నయన్, స్టార్ హీరోల పక్కన నటిస్తూనే… తన ఇమేజ్ పెంచుకునే పనిలో ఉంది. ప్రస్తుతం కెరీర్ పీక్ స్టేజ్ లో ఉన్న నయన్, సోషల్ మీడియాలో కనిపించదు. కానీ ఆమెకి సంబందించిన ప్రతి విషయం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంటుంది. అలా ఇప్పుడు నయనతార విషయంలో ఒక వీడియో వైరల్ అవుతోంది.

చంద్రముఖి సినిమా ద్వారా తెలుగు తమిళ ప్రేక్షకుల ముందుకి వచ్చిన ఈ మలయాళ కుట్టి, ఇండస్ట్రీలోకి రాకముందు యాంకర్ గా చేసింది. మలయాళ లోకల్ ఛానెల్ లో హోస్ట్ గా చేసిన నయనతార, ఆ తర్వాత సినిమాల్లోకి వచ్చి స్టార్ అయ్యింది. ఇన్నేళ్ల తర్వాత ఎలా బయటికి వచ్చిందో తెలియదు కానీ… నయనతార, డయానాగా యాంకరింగ్ చేసిన వీడియో ఇప్పుడు నెట్ లో వైరల్ అవుతుంది. ప్యూర్ మలయాళీ అమ్మాయిగా నయనతార అలియాస్ డయానాని చూస్తే ఒకప్పుడు నయన్ ఇలా ఉండేదా అనిపించకమానదు.