ఈ దశాబ్దపు సినిమా చూసిన అద్భుతం… నయనతార, ది సూపర్ స్టార్

సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ అండ్ మార్కెట్ క్రియేట్ చేసుకున్న నయనతార బర్త్ డే సందర్భంగా TFPC నుంచి స్పెషల్ స్టోరీ…

చంద్రముఖిలో హోమ్లీగా కనిపించినా, గజినిలో గ్లామర్ గా కనిపించినా, బిల్లాలో బికినీ వేసినా, సౌత్ లో మొదటిసారి జీరో సైజు మైంటైన్ చేసినా… ప్రేక్షకులు ఆమెని చూశారు, నెమ్మదిగా ఆమె కోసమే థియేటర్స్ కి వెళ్లారు. స్కిన్ షో చేసి ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించే దగ్గర నుంచి స్క్రీన్ పై తన యాక్టింగ్ షోతో అదే ప్రేక్షలని మెప్పించే వరకూ సాగిన నయనతార ప్రస్థానం అద్భుతం.

జీవితం మార్చిన రోజు:
గ్లామర్ హీరోయిన్ గా రాణిస్తున్న సమయంలో నయనతార నటించిన సినిమా శ్రీరామ రాజ్యం. అంతక ముందు బాలకృష్ణతోనే సింహా సినిమాలో హుందాగా కనిపించిన నయన్, బాపు తెరకెక్కించిన ఆధునిక రామాయణంలో సీతగా కనిపించింది. బికినీలు వేసుకునేది, స్కిన్ షో చేసేది, తెలుగు ముక్క కూడా రానిది రామాయణం లాంటి సినిమాలో నటించడమే గొప్ప అంటే ఏకంగా సీతగానే చూపిస్తున్నారు. మేకర్స్ ఏమైనా మతి పోయిందా అనే రేంజులో విమర్శలు వినిపించాయి. ఈ కామెంట్స్ అన్నింటినీ స్వీకరించిన నయన్, ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజున అంటే 2011 నవంబర్ 17న సాలిడ్ ఆన్సర్ ఇచ్చింది. శ్రీరామ రాజ్యంలో సీతగా, తన నటనతోనే నయనతార అందరినీ ఆశ్చర్యపరించింది. అంజలి దేవి తర్వాత సీత అంటే నయనతారనే అనే స్థాయిలో కంప్లేమేట్స్ అందుకుంది. విమర్శలు వచ్చినా, ప్రశంశలు వచ్చినా నయన్ స్పందించదు… సినిమాలో నటించడమే తన పని, ఎవరేమన్నా అది మాత్రం చేసుకుంటూ పోతుంది.

స్టార్ స్టేటస్:
ఇప్పుడు నయన్ ఉంటే 50 కోట్లు ఎక్కువగా వస్తాయని ఆమెని సినిమాల్లోకి తీసుకునే వాళ్లు ఉన్నారు. ఆమె ఒక పాత్రలో నటిస్తే, దానికి హుందాతనం వస్తుంది అని నయన్ ని కాస్ట్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. స్టార్ హీరోల పక్కన హీరోయిన్ గా నటిస్తూనే, లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ హిట్స్ అందుకుంటున్న నయనతార దశాబ్దమున్నరగా స్టార్ హోదాని ఎంజాయ్ చేస్తూనే ఉంది. హీరోయిన్ అనగానే ఒక సినిమాలో నటించే ప్రతి ప్రొమోషనల్ ఈవెంట్ కి వెళ్లి, మైక్ పట్టుకొని స్పీచ్ లు ఇవ్వాలి. సోషల్ మీడియాలో వరస ఫొటోస్ షూట్స్ తో ఫ్యాన్స్ కి కిక్ ఇవ్వాలి. అలాంటిది నయనతార మాత్రం ఒక ఈవెంట్ కి వెళ్ళదు, సోషల్ మీడియాలో కనిపించదు. నయనతార చూడాలి అంటే సినిమాకే వెళ్లాలి, ఈ సూత్రం సరిగ్గా పాటిస్తుంది కాబట్టే నయన్ మూవీస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తూ ఉంటారు.

కాబోయే జయలలిత?
ఒక సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తేనే స్టార్ హీరో అంటే నయనతార నిజంగానే స్టార్. ఒక సినిమా వెయిట్ ని క్యారీ చేసే హీరోలే సూపర్ స్టార్ అయితే నయనతార కూడా లేడీ సూపర్ స్టారే. ఒక నార్మల్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నయనతార, ఇప్పుడు అదే కమర్షియల్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ గా మారింది. ఇప్పుడున్న ఇమేజ్ మరో ఐదేళ్లు కొనసాగితే చాలు, నయనతార రాజకీయాల్లో కూడా రాణించే అవకాశం ఉంది. జయలలిత తర్వాత చాలా మంది సినిమా వాళ్లు రాజకీయాల్లోకి వచ్చారు కానీ సీఎం కుర్చీ దూరంగానే ఆగిపోయారు, ఇప్పుడు నయన్ కి ఉన్న ఇమేజ్ అండ్ ఫాలోయింగ్ చూస్తే జయలలిత తర్వాత ఆ కుర్చీలో కూర్చునే సత్తా ఆమెలో ఉంది అనిపిస్తుంది.

పర్సనల్ లైఫ్:
ప్రొఫెషనల్ లైఫ్ లోనే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా నయనతార చాలా స్టేబుల్ గా, నచ్చినట్లు ఉంటుంది. ఇప్పటికే ఇద్దరు హీరోలతో పెళ్లి వరకూ వెళ్లి ఆగిపోయినా డిప్రెస్ అవ్వని నయన్, ఆ స్ట్రెస్ ని సినిమాలు చేస్తూ తీసేస్తుంది. ప్రస్తుతం నయనతార, విగ్నేష్ శివన్ తో ప్రేమలో ఉంది. వీరు త్వరలో పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. పెళ్లి అయితే మంచిది, నయనతార మొత్తానికి ప్రేమించే పెళ్లి చేసుకుంటుంది. ఒకవేళ అదే పెళ్లి జరగకపోతే మరింత మంచిది, దే డోంట్ డిసర్వ్ మీ అనుకోని సినిమాలు చేస్తూ ముందుకెళ్లిపోతుంది. ఏ రోజైన ఆ సినిమా ప్రయాణం కాస్తా రాజకీయ ప్రస్థానంగా మారుతుందా అంటే దానికి కాలమే సమాధానం చెప్పాలి.