విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేసిన ‘లాభం’ ట్రైలర్.. సెప్టెంబర్ 9న సినిమా విడుదల!!

విజయ్ సేతుపతి శ్రుతిహాసన్ జంటగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన చిత్రం ‘లాభం’. ఏక కాలంలో రెండు భాషల్లోనూ సినిమా విడుదలవుతుంది. ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. ఎస్‌.పి.జననాథన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని లాయ‌ర్ శ్రీరామ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న సినిమాను విడుద‌ల చేస్తున్నారు. రీసెంట్‌గా ఈ సినిమా ట్రైల‌ర్‌ను విజ‌య్ సేతుప‌తి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా…

నిర్మాతలు మాట్లాడుతూ ‘‘విజయ్ సేతుప‌తి, శ్రుతిహాస‌న్ జంట‌గా న‌టించిన లాభం చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్ 9న తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుద‌ల‌వుతుంది. డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో పాటు అన్ని కమ‌ర్షియ‌ల్ హంగులతో రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగులో శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తుండ‌టం హ్యాపీగా ఉంది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ‘ అన్నారు.

తారాగణం:-

విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్, జగపతిబాబు, సాయి ధన్సిక, కలైయ రసన్, రమేష్ తిలక్, పృత్వి రాజన్, డేనియల్ అన్నే పోపే, నితీష్ వీర, జయ్ వర్మన్ తదితరులు నటిస్తున్నారు.

సాంకేతిక నిపుణులు:-

రచన, దర్శకత్వం: S.P. జననాథన్
స్క్రీన్ ప్లే: N. కల్యాణ కృష్ణన్
మ్యూజిక్: D. ఇమామ్
DOP: రాంజీ
ఎడిటర్: N. గణేష్ కుమార్
ఆర్ట్ డైరెక్టర్: వి. సెల్వకుమార్
స్టంట్: ధన అశోక్
మాటలు: రాజేష్.ఏ.మూర్తి
పాటలు: రాజశ్రీ సుధాకర్
పీ ఆర్వో : శ్రీ మారి