సల్మాన్ టెన్షన్… రానా పరేషాన్…

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత బయటకి వచ్చిన డ్రగ్ స్కాండల్ వ్యవహారం రోజుకొక సంచలన విషయం బయటపెడుతూ బాలీవుడ్ వర్గాలకి నిద్రలేకుండా చేస్తుంది. ఈ ఇష్యూ లోకి క్వాన్ (KWAN) అనే ప్రముఖ టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ కూడా వచ్చింది. సుశాంత్ కేసుకు లింక్స్ ఉన్నాయనే కోణంలో ఇప్పటికే ఎన్సీబీ అధికారులు క్వాన్ సీఈఓను విచారిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా క్వాన్ తరపున వివిధ నటీనటుల కోసం పనిచేస్తున్న మేనేజర్స్ ని కూడా డ్రగ్స్ వ్యవహారంలో క్రమంగా విచారించనున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో KWAN ఏజెన్సీలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కు వాటా ఉందనే వార్తలు వచ్చాయి. వీటిపై సల్మాన్ తరపున న్యాయవాది ఆనంద్ దేశాయ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ క్వాన్ లో తన క్లయింట్ కు KWANలో ఎలాంటి వాటా లేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే KWAN సౌత్ ఇండియాని రానా దగ్గుబాటి చూసుకుంటున్నాడు. రామానాయుడు స్టూడియోస్ లోనే KWAN సౌత్ ఇండియా ఆఫీస్ కూడా ఉంది. గతంలో KWANకి రానానే ప్రమోట్ చేశాడు కాబట్టి అతనికి వాటా ఉండే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ఇప్పుడు KWAN డ్రగ్స్ వ్యవహారంలో చిక్కుకోవడంతో రానాని విచారణకి పిలిచే అవకాశం ఉందా అనేది చూడాలి.

“Kwan Entertainment and Marketing Solutions has teamed up with film actor and studio owner Rana Daggubati to set up a joint venture to provide complete solutions for all stakeholders in the film industry. “The joint venture will take care of all the needs of stars, advertisers, brands and media corporations,” Anirban Blah, Managing Director of Kwan, has said.

ఇది KWANతో రానా దగ్గుబాటి కోలాబోరేట్ అయ్యే టైములో మ్యానేజింగ్ డైరెక్టర్ అనిర్బన్ చెప్పిన మాటలు. అయితే ఇటీవలే కాలంలో క్వాన్ ఏజెన్సీ కార్యకలాపాలలో రానా పెద్దగా ఇన్వాల్వ్ కానప్పటికీ.. క్వాన్ తో లింకులున్న వారందరినీ ఎంక్వరీ చేసే క్రమంలో రానాని కూడా ఎన్సీబీ అధికారులు పిలిచే అవకాశం లేకపోలేదని బాలీవుడ్ వర్గాల్లో చర్చించుకుంటున్నారు.