హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్న కుష్బూ కూతురు

కుష్బూ హీరోయిన్‌గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్‌తో పాటు నటిగా, నిర్మాతగా, పొలిటీషియన్‌గా విభిన్న రంగాల్లో సత్తా చాటుతోంది. ఆమె కూతురు అవంతిక సుందర్ త్వరలో నటిగా ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఆల్రెడీ ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌లు వస్తున్నప్పటికీ, ఇంకా ఏదీ ఖరారు చేయలేదని చెప్పింది. ఓ ఇంటర్వ్యూలో ఆమె, తన చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో అందమైన వారిని చూస్తూ పెరిగానని, తల్లి కుష్బూ, తండ్రి సుందర్ సినిమాలు తనను ఎంతగానో ఆకట్టుకున్నాయని తెలిపింది. తల్లిదండ్రుల సలహాలు ఎప్పుడూ తన మంచి కోసమేనని, ఇండస్ట్రీలోకి రావాలని చెప్పగా అమ్మ సపోర్ట్ చేసిందని, కానీ అది సులభం కాదని, నెపోటిజం గురించి మాటలు వస్తాయని కుష్బూ హెచ్చరించిందని అవంతిక చెప్పింది. తల్లి సూచనలతో అన్నింటికీ సిద్ధంగా ఉండాలని నిర్ణయించుకున్నానని, తన పాత్రల ద్వారా ప్రేక్షకులకు చేరువవుతాననే నమ్మకం ఉందని అవంతిక తెలిపింది.