17 ఏళ్ల తర్వాత కలిసి నటిస్తున్నారు… #Thalaivar168

దర్బార్ ప్రొమోషన్స్ ని మొదలుపెట్టిన సూపర్ స్టార్ రజినీకాంత్, తన నెక్స్ట్ సినిమాని శిరుత్తై శివ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యాడు. తలైవా 168గా సెట్స్ పైకి వెళ్లనున్న ఈ సినిమాకి ఇమ్మన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో కీర్తిసురేష్‌, జ్యోతిక హీరోయిన్లుగా కనిపించే అవకాశం ఉందని కోలీవుడ్ వర్గాల సమాచారం. మాస్ పల్స్ పర్ఫెక్ట్ గా తెలిసిన డైరెక్టర్ శివ, రజినీ కోసం ఒక సీనియర్ హీరోయిన్ ని సెట్ చేశాడు.

thalaivar 168

Thalaivar168 కాస్టింగ్ ఫైనల్ చేస్తున్న శివ, ఖుష్బుని ఒక ఇంపార్టెంట్ రోల్ లో తీసుకున్నారని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో ‘అన్నామలై’, ‘మన్నన్‌’, ‘పాండియన్‌’, ‘నట్టుక్కు ఓరు నల్లవన్‌’ చిత్రాల్లో నటించారు. చివరగా 1992లో ఈ ఇద్దరూ కలిసి నటించారు, దాదాపు 17 ఏళ్ల తర్వాత శివ మళ్లీ ఈ కాంబినేషన్ ని సెట్ చేశాడు. కమెడియన్ సూరి కూడా రజినీ పక్కన మొదటిసారి నటిస్తున్నాడు. రోబో, పేట సినిమాలని ప్రొడ్యూస్ చేసిన సన్‌ పిక్చర్స్‌ ఈ మూవీ నిర్మిస్తోంది. డిసెంబర్ 5 నుంచి #Thalaivar168 రెగ్యులర్ షూటింగ్ కోసం సెట్స్ పైకి వెళ్లనుంది.