‘అర్జున్ S/O వైజయంతి’ని బిగ్ హిట్ చేసిన ఆడియన్స్ కి పాదాభివందనాలు : విజయశాంతి

నందమూరి కళ్యాణ్ రామ్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అర్జున్ S/O వైజయంతి. ఈ చిత్రంలో విజయశాంతి పవర్ ఫుల్ పాత్రలో నటించారు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించి ఈ చిత్రాన్ని అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌లపై అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు నిర్మించారు. ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలైన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ లో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఈ సినిమాని సపోర్ట్ చేసి మంచి మాటలు రాసిన మీడియాకు, ఈ సినిమాకి ఇంత గొప్ప విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు పాదాభివందనాలు. ప్రజలు లేకపోతే ప్రేక్షకులు లేకపోతే ఏ హీరో లేరు, ఏ హీరోయిన్ లేదు. ఈరోజు సినిమా హిట్ అయిందంటే ఆ క్రెడిట్ మొత్తం ప్రేక్షకులదే. హీరోలు హీరోయిన్లకు జోష్ ఇచ్చి నిలబెట్టేది ప్రేక్షకులు. వారిని జీవితాంతం వారిని గుండెల్లో పెట్టుకుంటాం. చాలా సంవత్సరాల తర్వాత శ్రీకాంత్ గారితో కలిసి పని చేయడం ఆనందంగా ఉంది. తనకి ఏ పాత్ర ఇచ్చిన చక్కగా ఒదిగిపోగలరు. బబ్లు నా తమ్ముడు. ఏ పాత్ర ఇచ్చిన అద్భుతంగా చేస్తాడు. డైరెక్టర్ ప్రదీప్ ప్రతి క్యారెక్టర్ని చాలా బ్యాలెన్స్ గా డీల్ చేశారు. ఈ సినిమా క్లైమాక్స్ లో ఒక సీన్ ఉంది. ఆ సీన్ ని వేరే హీరో అయితే ఒప్పుకోరు. ఇంపాజిబుల్. హీరోలకి ఇమేజ్ విషయంలో చాలా లెక్కలు ఉంటాయి. ఈ సినిమాలో కళ్యాణ్ బాబు అంతా రిస్క్ తీసుకుని లాస్ట్ 20 నిమిషాల్ని అద్భుతంగా మలచడంలో ప్రధాన పాత్ర పోషించారు. అంత రిస్క్ చేసిన బాబుకి నిజంగా హాట్సాఫ్ చెప్పాలి. బాబుకి హృదయపూర్వక అభినందనలు. డిఓపి రాంప్రసాద్ అందరినీ అద్భుతంగా చూపించారు. ఈ సినిమాలో ఫస్ట్ ఫైట్ చూసి అభిమానులు చాలా కొత్తగా ఉంది చాలా అద్భుతంగా చేశారు అక్క అని చెబుతుంటే ఆనందం అనిపించింది. ఈ ఫైట్ ని పృథ్వి కంపోజ్ చేశాడు. తనకి ముందే చెప్పాను నేను చాలా ఫైట్లు చేశాను ఇందులో ఏదో ఒక కొత్తదనం ఉంటేనే చేద్దాం అని చెప్పాను. తను ఒక ఐదు సరికొత్త మూమెంట్స్ ని కంపోస్ట్ చేసి చూపించాడు. ఈ సందర్భంగా తనకి థాంక్స్ చెబుతున్నాను .అలాగే క్లైమాక్స్ లో ఫైట్ చేయించిన రామకృష్ణ మాస్టర్ మాస్టర్ కి థాంక్యూ. ఈ సినిమాకి పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. దేవుడు దయవల్ల ఈ సినిమా ప్రజలకు నచ్చింది. మా కష్టానికి తగిన ఫలితం దొరకడం ఆనందాన్ని ఇచ్చింది. నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాని భారీగా తరకెక్కించారు. వారి గట్స్ కి హ్యాట్సాఫ్ .మహిళలు ఈ సినిమాకి వస్తున్నారు. అనేక చోట్ల నుంచి ఫోన్లు చేస్తున్నారు. సినిమా బాగుందని చెప్తున్నారు. తల్లి కొడుకుల ఎమోషన్తో కూడుకున్న కథ ఇది. మహిళలందరూ కూడా ఈ సినిమాకి వస్తున్నారు చూస్తున్నారు ఆస్వాదిస్తున్నారు.  ప్రతి సినిమా ఆడాలని మేము కోరుకుంటున్నాం. సినిమాపై నెగిటివ్ ప్రచారం చేయడం సరికాదు. దయచేసి కొందరు మైండ్ సెట్ ని కాస్త మార్చుకోండి. ఇండస్ట్రీని బతకనివ్వండి. మనస్ఫూర్తిగా సినిమాని దీవించడం నేర్చుకోండి. సినిమాని స్పాయిల్ చేయకండి. అందరి హీరోలు డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు బాగుండాలని నేను మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్ని అబద్ధాలు చెప్పినా చివరికి నిజమే గెలుస్తుంది. ఈ సినిమానే గెలుస్తుంది. ఈ సినిమాతో నాకు కళ్యాణ్ బాబుకి ఒక మంచి బాండింగ్ ఏర్పడింది. తను డే వన్ నుంచి అమ్మ అమ్మ అని పిలుస్తూ ఎంతో ప్రేమని అభిమానాన్ని చూపించాడు. ఈ సినిమాలో బాబు అద్భుతంగా చేశాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ గారికి థాంక్స్ చెప్తున్నాను. ఆ రోజు ఈవెంట్ కి వచ్చి ఎంత చక్కని మాటలు చెప్పారు. నన్ను తండ్రి స్థానంలో కూర్చోబెట్టి అమ్మా అని పిలిచారు. మీరు బాగుండాలి బాబు.  జూనియర్ ఎన్టీఆర్ గారికి వారి అభిమానులకి కళ్యాణ్ బాబు వారి అభిమానులకి రెండు రాష్ట్ర ప్రజలకు నా అభిమానులకి మరోసారి నా కృతజ్ఞతలు. ఈ సినిమాని ఇంకా పెద్ద హిట్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అన్నారు.

హీరో నందమూరి కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ… అందరికి నమస్కారం. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు, నందమూరి అభిమానులకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మంచి సినిమాని అందిస్తే మమ్మల్ని ఆదరించడానికి తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ముందుంటారు. బింబిసార సినిమా సమయంలో కూడా ఇదే మాట చెప్పాను. మరోసారి ఆ మాటని రుజువు చేసిన ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. డిస్ట్రిబ్యూటర్స్ కాల్ చేసి మంగళవారం బుధవారం లోగ బ్రేక్ ఈవెన్ అవుతుంది, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు థాంక్యూ సో మచ్’అని వాళ్ళు చెబుతుంటే చాలా ఆనందంగా అనిపించింది. ఈ కథ ఫస్ట్ డే చెప్పినప్పుడే ఇది ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు ప్రదీప్. తనకి కమర్షియల్ సినిమా మేకింగ్ లో మంచి టేస్ట్ ఉంది. కమర్షియల్ సినిమాలో కూడా కొత్తదనం ఉంటేనే ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఈ సినిమాలో చివరి 20 నిమిషాలు ఆడియన్స్ అంతలా కనెక్ట్ అవుతున్నారంటే అది డైరెక్టర్ ఈ కథని అంత ఎమోషనల్ గా నడిపిన విధానం. ఇంత మంచి కథని అందించిన ప్రదీప్ కి థాంక్యూ. పృథ్వి గారిని స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందంగా అనిపించింది. సినిమా అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్. స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ కి గురవ్వాలి. ఇలాంటి క్లైమాస్క్ చెప్పిన శ్రీకాంత్ విస్సా  కి థాంక్యూ. రఘురాం ఇందులో ఎమోషనల్ సాంగ్స్ ని అద్భుతంగా రాశాడు. మా బ్యానర్ ప్రతి సినిమాలో  రామకృష్ణ మాస్టారు ఉంటారు. మా అబ్బాయి సినిమా చూసి ‘నాన్న మీ సినిమాలో బెస్ట్ యాక్షన్ సీక్వెన్స్ ఇవే’ అని చెప్పాడు. ఫైట్ మాస్టర్స్ అందరికీ థాంక్యూ.  అతనొక్కడే సినిమాకి రాంప్రసాద్ గారు డిఓపి. చాలా సంవత్సరాల తర్వాత మళ్లీ ఆయనతో ఈ సినిమా కలిసి చేశాం. అప్పుడు ఏ ఎనర్జీ ఉండేదో ఇప్పుడు కూడా అదే ఎనర్జీతో ఉన్నారు. ఈ సినిమా క్లైమాక్స్ ఎక్స్ట్రార్డినరీ అని చెప్పిన ఫస్ట్ పర్సన్ శ్రీకాంత్ గారు. శ్రీకాంత్ గారితో కలిసి వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా రావాలి మంచి విజయం సాధించాలని నిరంతరం తపనతో పనిచేసిన మా ప్రొడ్యూసర్స్ అశోక్ సునీల్ కి థాంక్యూ. నెక్స్ట్ సినిమా కూడా  వారి బ్యానర్ లోనే చేయాలని ఉంది. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్ చేసిన అజినిస్ కు  థాంక్యూ. అమ్మ (విజయశాంతి) గారు ఈ సినిమా చేయకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమా మెయిన్ పిల్లర్ అమ్మ. ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక రియల్ లైఫ్ సంఘటన గుర్తొచ్చింది. నాకు 13 ఏళ్ళు వచ్చే వరకు మా అమ్మ పుట్టిన రోజు ఎప్పుడో నాకు తెలియదు. అమ్మ బర్త్ డే  తెలుసుకునే క్రమంలో సంక్రాంతి రోజు పుట్టారని తెలిసింది. పంచాంగాలు అన్ని చూసి జనవరి 15 అమ్మ పుట్టినరోజు అని తెలిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు ఏ రోజు కూడా మా అమ్మగారి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోకుండా నేను లేను. ఈ కథ చెప్పినప్పుడు నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది. తల్లిదండ్రులు లేనిది మనం లేము. మనం జీవితాంతం వారికి రుణపడిపోయి ఉండాలి. అది మన బాధ్యతగా తీసుకోవాలి. ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే  చేయడానికి కరెక్ట్ మనిషి విజయశాంతి గారు. ఆ దేవుడే ఈ కథ ద్వారా అమ్మని ఒప్పించాడు. అమ్మకి హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈరోజు మాట్లాడడానికి కారణం ప్రేక్షకులు నందమూరి అభిమానులు మాకు ఇచ్చిన సక్సెస్. జీవితాంతం మీకు రుణపడి ఉంటాను. అందరికీ థాంక్యు. జోహార్ ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ.. జైహింద్’ అన్నారు.

యాక్టర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… ఈ సినిమాని విజయవంతం చేసిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్, టీమ్ అందరికీ కంగ్రాజులేషన్స్. ఈ సినిమాలో నేను కీ రోల్ ప్లే చేశాను. డైరెక్టర్ గారు చాలా ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ లాగా సినిమాని ట్రీట్ చేశారు. కత్తి మీద సాము లాంటి సినిమా ఇది. ప్రదీప్ చాలా అద్భుతంగా డీల్ చేశాడు. విజయశాంతి గారి సినిమాలు చూసి మేము చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. చాలా సంవత్సరాల తర్వాత విజయశాంతి గారితో కలిసి పనిచేయడం ఆనందంగా ఉంది. అప్పట్లో ఎంత ఎనర్జీగా ఉన్నారో ఇప్పుడు కూడా అంతే ఎనర్జీతో ఉన్నారు. సినిమాలో వర్క్ చేస్తున్నంత సేపు చాలా పాజిటివ్ వైబ్ ఉండేది. ఆ డెడికేషన్ అందరూ నేర్చుకోవాలి. విజయశాంతి గారు ఎప్పుడూ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కళ్యాణ్ గారి వర్క్ చేయడం ఫస్ట్ టైం. చాలా డౌన్ టు ఎర్త్ పర్శన్. సినియర్స్ అంటే చాలా రెస్పెక్ట్.  కళ్యాణ్ రామ్ గారు రియల్లీ హాట్సాఫ్. చాలా డెడికేషన్ తో ఈ సినిమా చేశారు. రియల్ మదర్ అండ్ సన్ లాంటి ఫీలింగ్ తోనే సినిమా చేశారు. ఇంత మంచి కమర్షియల్ సినిమాతో రావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మరిన్ని మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.

నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా మాట్లాడుతూ.. ఇంత పెద్ద సక్సెస్ మేము కూడా ఊహించలేదు. ఆడియన్స్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. ఇది మదర్ అండ్ సన్ ఎమోషనల్ కథ. ఈ విజయానికి కారణం ఆ పాత్రలు చేసిన కళ్యాణ్ రామ్ గారు విజయశాంతి గారు. వారికి చాలా థాంక్స్. వారిద్దరి పెర్ఫార్మెన్స్ వలనే ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. డైరెక్టర్ ప్రదీప్ ఈ సినిమాని అద్భుతంగా రూపొందించారు. ఎడిటర్ తమ్మి రాజు గారికి మ్యూజిక్ డైరెక్టర్ అజనీష్ గారికి, ఫైట్ మాస్టర్స్, డిఓపి రాంప్రసాద్ గారికి ఈ సినిమాల్లో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు’ అన్నారు.

డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. మేము ఏం ఎచీవ్ చేస్తామని అనుకున్నామో, అది ఈ సినిమాతో సాధించాం. ఆడియన్స్ ప్రతి సీక్వెన్స్ బాగుందని చెప్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది. క్లైమాక్స్ గూస్ బంప్స్ అంటున్నారు. అలాంటి క్లైమాక్స్ ని ఒప్పుకున్నా కళ్యాణ్ రామ్ గారికి థాంక్యూ. ఆయన నమ్మకపోతే ఈ సినిమా లేదు. పృథ్వి గారు, శ్రీకాంత్ గారికి థాంక్యూ. విజయశాంతి మేడం గారు చాలా కష్టపడ్డారు. చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. మా ఫైట్ మా ఫైట్ మార్ట్ మాస్టర్స్ అద్భుతంగా యాక్షన్ డిజైన్ చేశారు. అజనీష్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేశారు. మా ఎడిటర్ తమ్మిరాజు గారు మొదట్నుంచి సపోర్ట్ చేశారు. సినిమాకి ఆడియన్స్ రివ్యూస్ అద్భుతంగా ఉన్నాయి. ఆడియన్స్ కి సినిమా చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా థాంక్యూ’ అన్నారు.

యాక్టర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ.. అందరికీ థాంక్యు. ఈ సినిమాలో నేను చేసిన ప్రతి షాట్ ఉంది. ఒక ఆర్టిస్ట్ కి అది చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది. యానిమల్ తర్వాత ఈ సినిమా ఆఫర్ వచ్చింది. ఈ క్యారెక్టర్ చెప్పినప్పుడే చాలా పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న క్యారెక్టర్ అనిపించింది. కళ్యాణ్ రామ్ గారికి థాంక్యూ. ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చిన డైరెక్టర్ గారికి థాంక్యూ. నా కెరీర్లో ఈ సినిమా బెస్ట్ ఫిల్మ్. అందరికీ థాంక్యు వెరీ మచ్’ అన్నారు.

స్టంట్ మాస్టర్ రామకృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈ సినిమాని ఆడియన్స్ విపరీతంగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆడియన్స్ రియాక్షన్స్ చూస్తే ఎమోషన్ ఆపుకోలేకపోయాను. ఎన్టీఆర్ గారు చెప్పినట్టు లాస్ట్ 20 నిమిషాలు ఆడియన్స్ స్టన్ అయిపోయారు. థియేటర్స్ లో లేచి క్లాప్స్ కొట్టారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన కళ్యాణ్ రామ్ గారికి, నిర్మాతలకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు’ అన్నారు.

లిరిక్ రైటర్ రఘురాం మాట్లాడుతూ. అందరికీ నమస్కారం. ఇలాంటి మంచి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి. ఈ సినిమాకి సింగిల్ కార్డ్ రాయడం అదృష్టంగా భావిస్తున్నాను. ఇంత మంచి అవకాశం కల్పించిన కళ్యాణ్ రామ్ గారికి నిర్మాతలకు డైరెక్టర్ గారికి ధన్యవాదాలు. అమ్మని ఇష్టపడే వారందరూ ఈ సినిమాని ఇష్టపడతారు. ఈ సినిమా నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఇంత మంచి జర్నీ ఇచ్చిన మా టీమ్ అందరికీ థాంక్యు’ అన్నారు.

రైటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ… ఈ సినిమా కోసం అందరం కష్టపడ్డాం. కానీ సినిమాని ముందుకు తీసుకెళ్లిన నమ్మకం కళ్యాణ్ గారిది. ఆ నమ్మకాన్ని నిలబెట్టిన తెలుగు సినిమా ప్రేక్షకులందరికీ శతకోటి ధన్యవాదాలు. రెస్పాన్స్ థియేటర్స్ లో చూసినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. మా డైరెక్టర్, మా ప్రొడ్యూసర్స్, విజయశాంతి గారు, శ్రీకాంత్ గారు అందరికీ ధన్యవాదాలు.  టీం అందరి కాంట్రిబ్యూషన్ వల్లనే ఈరోజు సక్సెస్ ని చూడగలిగాం’ అన్నారు.