కొత్త కంటెంట్ తో సినిమాలు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు యంగ్ హీరో
ఉదయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా “క్షణక్షణం” శుక్రవారం
ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. మన మూవీస్ బ్యానర్ లో జియా
శర్మ నాయికగా కార్తిక్ మేడికొండ దర్శకత్వంలో డాక్టర్ వర్లు “క్షణక్షణం”
చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాలో నటించిన అనుభవాలను హీరో ఉదయ్ శంకర్
మీడియాతో పంచుకున్నారు. ఆ విశేషాలు చూస్తే..
నేను గతంలో రెండు చిత్రాలు “ఆటగదరా శివ”, “మిస్ మ్యాచ్” లో హీరోగా
చేశాను. ఆటగదరా శివ చిత్రానికి ఓటీటీలో మంచి ఆదరణ దక్కింది. ఆటగదరా శివ
చిత్రానికి అత్యధిక వ్యూయింగ్ వచ్చినట్లు ఈ మధ్య బన్నీ వాస్ గారు
చెప్పారు. మూడో చిత్రంగా క్షణక్షణం చిత్రం చేశాను. సినిమా రిలీజ్
కాబోతోంది.
ఆడియెన్స్ థియేటర్ కు రావాలి లేకపోతే ఒక మంచి సినిమా ఇలా వచ్చి అలా
వెళ్లిపోతుంది. ప్రమోషన్ బాగా చేస్తున్నాం. ఈ టైమ్ లో థియేటర్లు ఎక్కువగా
దొరకడంలేదు. అయినా గీతా ఫిలింస్ వారు వీలైనంత ఎక్కువ థియేటర్లు
ఇస్తున్నారు. నాజీవితంలో జరిగిన ఘటనలు కొన్ని ఈ కథలో రిలేట్ అయ్యాయి.
హీరో క్యారెక్టరైజేషన్ నాజీవితంతో పోల్చుకున్నాను. నాకే కాదు చాలా మందికి
ఇలా జరుగుతుంటాయి. ఇంట్లో, బయటా రిజెక్షన్స్ వస్తుంటాయి. నా జీవితంలో పదీ
పదిహేనేళ్లుగా నా జీవితంలో ఇలాంటివే జరిగాయి. కాబట్టి నేను నటించేందుకు
పెద్దగా కష్టపడలేదు. సహజంగానే అనిపించింది.
క్షణక్షణం టైటిల్ ను నేను బజ్ కోసం పెట్టలేదు. చూడగానే క్యాచీ టైటిల్ అని
పెట్టాను అని దర్శకుడు అన్నారు. క్షణక్షణం టైటిల్ కథకు యాప్ట్. వెంకటేష్
గారి క్షణక్షణం పెద్ద హిట్ సినిమా. ప్రేక్షకులకు బాగా నచ్చిన చిత్రం. మా
సినిమా డార్క్ హ్యూమర్ గా ఉంటుంది. చివరి 20 నిమిషాలు ఊహించలేరు. బన్నీ
వాస్ గారికి కూడా ఆ చివరి ఇరవై నిమిషాలే బాగా నచ్చింది. నేను ఊహించలేదు
ఉదయ్ అన్నారు.
మా కథకు కామెడీ కావాలని యాడ్ చేస్తే అసహజంగా ఉంటుంది. హీరో క్యారెక్టర్
నుంచే కామెడీ పుడుతుంది. హీరో బాధలే ప్రేక్షకులకు నవ్వులు పంచుతాయి. కోటి
గారితో నా ఫస్ట్ మూవీ. లాయర్ క్యారెక్టర్ చేశారు. ముందుకు ఈ క్యారెక్టర్
కు కీరవాణి గారిని అనుకున్నాం. అయితే ఆయన ఆర్ఆర్ఆర్ బ్యాక్ గ్రౌండ్ లో
బిజీగా ఉండి ఉంటారు. కోటి గారు చివరకు మా టీమ్ లోకివచ్చారు. రోషన్ సాలూరి
మ్యూజిక్ బాగాచేశారు. ఆయన నిర్మల కాన్వెంట్ చిత్రానికి రోషన్ బాగా
మ్యూజిక్ చేశాడు. తండ్రి కోటిగారు నటిస్తుంటే రోషన్ మ్యూజిక్ చేయడం
వాళ్లిద్దరికీ కొత్త ఎక్సీపిరియన్స్. కోటి గారు సీన్ పేపర్ తీసుకుని
క్యారెక్టర్ లోకి ఇన్వాల్వ్ అయి చేశారు. ఎన్నిసార్లు టేక్స్ చేస్తానని
కోటి గారు అన్నారు.
కార్తీక్ గారు కథ చెప్పినప్పుడు తీసింది చూసినప్పుడు ఒకేలా అనుభూతి
చెందాం. ఈ కథను అనుకున్నట్లే చేయాలి. అనుకున్నదానికంటే ఎక్కువచేసినా
సమస్యే. మేము అనుకున్నంతే చేయాలి. ఇంకొంత సీన్స్ ఎక్కువ చేయకుండా
ఖచ్చితంగా అనుకున్నట్లే చేశాం. మౌళి గారు వన్ ఆప్ ద ప్రొడ్యూసర్. కోవిడ్
టైమ్ లో ఫిష్ హార్బర్ లో సినిమా షూటింగ్ చేయాలి. వర్లు గారు, మౌళి గారు
లేకుంటే మా సినిమా షూటింగ్ అయ్యేది కాదు. మాస్క్ లు, శానిటైజర్లు, పీపీఈ
కిట్స్ ఇలా ప్రతి ఒక్కరికీ ఇచ్చారు. ఉన్నవారికంటే ఎక్కువే తీసుకొచ్చి
పెట్టారు. క్షణక్షణం సినిమా ఆడితేనే మరో సినిమా అవకాశం హీరోగా వస్తుంది,
ఆ వాస్తవం నాకుతెలుసు. నేను లెక్కల్లో జీనియస్ గానీ, సినిమా లెక్కలు
అస్సలు తెలియవు. కోటి, రఘు కుంచె, గిఫ్టన్ ఈ ముగ్గురు సంగీత దర్శకులు. మా
సినిమాలో వాళ్లు నటించడం కో ఇన్సిడెంట్.
నాకు హీరోయిన్ జియా శర్మతో సినిమాలో ఎలాంటి కెమిస్ట్రీ ఉండదు. ఆమె నా
భార్య క్యారెక్టర్ చేసింది, ఎప్పుడూ మాకు గొడవలు జరుగుతుంటాయి. ఒక సమస్య
నుంచి బయటకు రాగానే మరో సమస్యలో హీరో పడతాడు. క్లైమాక్స్ లో వచ్చే సీన్స్
బాగా ఆకట్టుకుంటాయి. మేము ఏం చేసినా సినిమా జనాలు చూడాలి. ఫస్టాఫ్ సినిమా
బాగుంటుంది. ఇంటర్వెల్ నుంచి సినిమా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి
చివరి దాకా సినిమా ప్రేక్షకుల్ని కూర్చోబెడుతుంది. సెకండాఫ్ నుంచి
క్లైమాక్స్ దాకా ఉత్కంఠగా ఉంటుంది.
రొటీన్ సినిమాలు కొత్త హీరోలు చేస్తే చూడరు. బ్యాక్ గ్రౌండ్ ఉంటే రెడీ
మేడ్ ఫ్యాన్స్ ఉంటారు వాళ్ల సంగతి వేరు. బయట నుంచి వచ్చి కొత్తగా ట్రై
చేసే హీరోలకు డిఫరెంట్ కథలు ఎంచుకోవాలి, విజయ్ సేతుపతి, ఆయుశ్మాన్ ఖురానా
లాంటి వాళ్లు బాలీవుడ్ లో అదే ప్రయత్నం చేశారు. ఈ హీరో వస్తుందంటే ఏదో ఓ
కొత్త కథ ఉంటుందనే పేరొస్తే చాలు. అభిమానులు వస్తుంటారు. ఉదయ్ సినిమా
వస్తుందంటే ఏదో కొత్త కథ తీసుకొస్తాడనే పేరు తెచ్చుకోవాలని ఉంది. కథలో
ఇంపార్టెంట్స్ ఉంటే క్యారెక్టర్స్ చేసేందుకైనా సిద్ధమే. అయితే హీరోగా
చేయాలనేది నా కోరిక. ఒక సఖి, గీతాంజలి, ఓకే బంగారం లాంటి ఫీల్ గుడ్
ప్రాపర్ లవ్ స్టోరీలో నటించాలని ఉంది.