గోల్డెన్ ఛాన్స్ పట్టిన కృతి శెట్టి – తన నెక్స్ట్ సినిమా హీరో ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

ఉప్పెన సినిమాతో టాలీవుడ్ లో ఆరంగేట్రం చేసి మంచి విజయాన్ని సాధించింది కృతి శెట్టి. తన అందంతో కుర్రాళ్ళ మనసులు దోచుకున్న కృతి ఆ తరువాత వరుసగా సినిమాలు తీస్తూ తన ఫాలోయింగ్ పెంచుకుంది. శ్యామ్ సింగ రాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. ఆ తరువాత కొన్ని సినిమాలు అంతగా విజయం సాదించనప్పటికీ కొంత మందికి మాత్రం క్రష్ గా మిగిలిపోయింది. ఇటీవలే విడుదల అయినా మనమే పై ఎన్నో ఆశలు పెట్టుకున్న కృతి ఆ సినిమా కూడా అంతంత మాత్రంగా విజయం సాధించడంతో నిరాసపాలైంది.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు ఆమె ఓ గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. సీతారామన్ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకున్న దుల్కర్ సల్మార్ తో ఆమె నటిచబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. సెల్వరాజ్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో దుల్కర్, కృతి జంటగా నటించబోతున్నారు అని తెలుస్తుంది. అలాగే ఆ సినిమాను రానా దగ్గుబాటి నిర్మించనున్నట్లు సమాచారం. అయితే ప్రస్తుతం దుల్కర్ నటిస్తున్న లక్కీ బాసుఖర్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని సెప్టెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక మిగతా విషయాల కోసం వేచి చూడాల్సిందే.