ఆ నటుడితో కొన్నేళ్లుగా డేటింగ్‌లో ఉన్నానన్న టాలీవుడ్ హీరోయిన్

బాలీవుడ్ నటుడు పుల్‌కిత్ సామ్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు హీరోయిన్ కృతికర్బంద వెల్లడించింది. కొన్ని నెలల నుంచి తాము రిలేషన్‌లో ఉన్నామని చెప్పింది. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోనున్నారని, కొద్దిమంది బంధువుల సమక్షంలో పెళ్లి జరగనుందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో దీనిపై కృతి స్పందించింది. ఇప్పట్లో వివాహబంధంలోకి అడుగుపెట్టాలనే ఆలోచనల తనకు లేదని చెప్పింది.

kriti kharbanda

పుల్‌కిత్ చాలా మంచి వ్యక్తి అని, వ్యక్తిగత ప్రేమకు అతను ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తుంటాడని చెప్పింది. తమ ఇద్దరి అభిప్రాయాలు కలిసి స్నేహితులమయ్యామని, అనంతరం రిలేషన్‌లోకి అడుగుపెట్టామని కృతి తెలిపింది. ఏడాదిన్నర నుంచి డేటింగ్‌లో ఉన్నామని, తమ పెళ్లి గురించి వస్తున్న వార్తల్లో నిజం లేదంది. ప్రస్తుతం తమ దృష్టంతా కెరీర్‌పైనే ఉందని చెప్పింది.

తెలుగులో బోణి సినిమాతో కృతి హీరోయిన్‌గా పరిచయమైంది. ఆ తర్వాత తీన్‌మార్, మిస్టర్ నూకయ్య, ఒంగోలు గిత్త సినిమాల్లో నటించింది. ఇక చివరిగా రాంచరణ్ హీరోగా వచ్చిన బ్రూస్ లీ సినిమాలో నటించింది.