Krishnam Raju passes away : సీనియర్ నటుడు కృష్ణంరాజు కన్నుమూత‌

సీనియర్ నటుడు, నిర్మాత, రెబల్ స్టార్ కృష్ణంరాజు (Krishnam Raju) ఆదివారం ఉదయం 3.25 నిమిషాలకు హైదరాబాద్‌లోని AIGహాస్పిటల్‌లో క‌న్నుమూశారు. ఇండస్ట్రీలో రెబెల్ స్టార్‌గా క్రేజ్ తెచ్చుకున్న కృష్ణంరాజు పూర్తి పేరు ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు. ఆయన వయసు 83 సంవత్సరాలు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు. 1940 జనవరి 20న పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించారు.

1966లో చిలకా గోరింక చిత్రంతో హీరోయిన్ తెలుుగ చిత్రసీమలోకి అడుగు పెట్టారు. సోమ‌వారం హైదరాబాద్ లో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న ప్రభాస్‌కు కృష్ణంరాజు పెద్దనాన్న అవుతారు. కృష్ణంరాజు తుది శ్వాస విడిచారనే వార్త టాలీవుడ్‌కి షాకింగ్‌గా ఉంది.