మాజీ ప్రియుడిపై హాట్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్

బాలీవుడ్ హీరో టైగర్ షాఫ్ర్ చెల్లి కృష్ణ షాఫ్ర్ ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్ ఎబాన్ హైమ్స్‌కి బ్రేకప్ చెప్పిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాలో అతడి ఫొటోలకు తనను ట్యాగ్ చేయవద్దని, మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నామని అభిమానులకు చెప్పింది. విడిపోయినా తామిద్దరం ఫ్రెండ్స్ గానే ఉంటామని, ఎప్పటిలాగే ఒకరికొకరం గౌరవం ఇచ్చుకుంటామని చెప్పింది. ఎబాన్ హైమ్స్, కృష్ణ షాఫ్ర్ కొద్ది సంవత్సరాల పాటు డేటింగ్‌లో ఉన్నారు. ఆ తర్వాత అనివార్య కారణా వల్ల ఇటీవలే విడిపోయారు.

krishna sharff

ఎబాన్ హైమ్స్‌తో విడిపోయిన తర్వాత మరొకరితో కృష్ణ షాఫ్ర్ ప్రేమలో పడిందని ఇటీవల వార్తలొచ్చాయి. అయితే మాజీ ప్రియుడి ఎబాన్ హైమ్స్‌తో బ్రేకప్ గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో కృష్ణ షాప్ర్ స్పందించింది. తామిద్దరం విడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయని, కానీ వాటిని తాను ప్రైవేట్‌గా ఉంచుతానని చెప్పింది. రిలేషన్‌షిప్‌లో ఉన్నప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉంటేనే బాగుంటుందని తామిద్దరికి అనిపించిందని తెలిపింది.

ప్రస్తుతం తాను ఒంటరిగానే ఉన్నానని, ఎవరితోనే రిలేషన్‌షిప్‌లో లేనని చెప్పింది. సింగిల్ లైఫ్ చాలా బాగుందని చెప్పింది. ప్రస్తుతం తాను ఇష్టపడే, కోరుకునే పనులను చేస్తున్నానని, ఇది రిఫ్రెష్‌గా ఉందంది.