కొత్త బాయ్‌ఫ్రెండ్‌కు ముద్దులు పెడుతూ రచ్చ చేసిన బ్యూటీ

బాలీవుడ్ యంగ్ హీరో టైగ‌ర్ ష్రాఫ్ చెల్లి కృష్ణా ష్రాఫ్ కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో రచ్చ చేస్తోంది. గతంలో బాస్కెట్‌బాల్ ప్లేయర్ ఎబోనా హైమ్స్‌తో కొన్ని సంవత్సరాల పాటు ఆమె డేటింగ్‌లో గడిపింది. ఆ తర్వాత ఇటీవలే అతడికి బ్రేకప్ చెబుతున్నట్లు ప్రకటించింది. అతడి నుంచి విడిపోతున్నానని, సోషల్ మీడియాలో అతడికి సంబంధించిన ఫొటోలకు తనను ట్యాగ్ చేయవద్దని అభిమానులను కోరింది.

ఇది జరిగి కొద్దిరోజులు కాకముందే ఇప్పుడు మరో కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను ఆమె వెతుక్కుంది. అతడితో కలిసి ఇప్పుడు రచ్చ రచ్చ చేస్తోంది. తాజాగా టర్కిష్ చెఫ్ అయిన నుస్రెట్‌తో కలిసి దిగిన ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోలో అడికి ముద్దులు పెడుతూ కనిపించింది.

ఈ ఫోటోపై కృష్ణ ష్రాఫ్ మాజీ ప్రియుడు ఎబోనా హైమ్స్ స్పందించాడు. నువ్వు చాలా త్వరగా కదులుతావు అని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక కృష్ణ ష్రాఫ్ కొత్త బాయ్‌ఫ్రెండ్ నుస్రెట్ చేసిన మరో కామెంట్ చర్చనీయాంశంగా మారింది. టైగర్ ష్రాఫ్‌తో కలిసి ఉన్న ఫొటోను పోస్ట్ చేసిన నుస్రెట్.. “బ్రదర్” అని కామెంట్ చేశాడు.