ఫిబ్రవరి 5 నుంచి డిజిటల్‌లో ‘క్రాక్’

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన సినిమా క్రాక్. ఇటీవల సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సంపాదించుకుని సూపర్ హిట్‌గా నటించింది. సంక్రాంతికి విడుదలైన సినిమాల్లో తెలుగులో ఈ సినిమాకే ఎక్కువ కలెక్షన్లు వచ్చాయి. రవితేజ నటించిన గత రెండు సినిమాలు అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. కానీ క్రాక్ సినిమాతో రవితేజ మళ్లీ హిట్ అందుకున్నాడు.

krack premieres from feb5

అయితే క్రాక్ డిటిజల్ ఎంట్రీకి రంగం సిద్ధమైంది. ఫిబ్రవరి 5 నుంచి ప్రముఖ తెలుగు ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహాలో క్రాక్ స్ట్రీమింగ్ కానుంది. భారీ రేటుకు ఆహా యాజమాన్యం క్రాక్ డిజిటల్ రైట్స్‌ను సంపాదించుకుంది. దాదాపు రూ.8 కోట్లు పెట్టి డిటిటల్ రైట్స్ కొనుగోలు చేసినట్లు ఇటీవల వార్తలొచ్చాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించిన క్రాక్.. డిజిటల్ వేదికపై ఎలాంటి రెస్పాన్స్ సొంతం చేసుకుంటుందో చూడాలిజ