చిరుని కలిసిన ‘క్రాక్’ డైరెక్టర్

మాస్ మహారాజా రవితేజ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన క్రాక్ సినిమా జనవరి 9 న విడుదలై భారీ వసూళ్లను సాధిస్తోంది. ఈ క్రమంలో క్రాక్ సినిమా యూనిట్‌కి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు చెబుతున్నారు. మెగా పవర్ స్టార్ రాంచరణ్ సినిమా రిలీజ్ అయిన తర్వాతి రోజు యూనిట్‌కి కంగ్రాట్స్ చెప్పి సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రశంసలు కురిపించాడు. ఈ క్రమంలో తాజాగా క్రాక్ యూనిట్‌కి మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలిపాడు.

GOPICHAND MALINENI MEET CHIRU

తాజాగా చిరంజీవిని క్రాక్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలిశాడు. దీనికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చిరుతో కలిసి దిగిన ఫొటోని తన ట్విట్టర్‌లో గోపీచంద్ మలినేని పోస్ట్ చేశాడు. ‘ఇది నాకు మెగా డే. మెగాస్టార్ నుంచి వచ్చిన ప్రశంసలు తమ సినిమా విజయానికి సత్యమైన సాక్ష్యం లాంటివి. చిరంజీవిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ మీటింగ్ ద్వారా ఆయన నుంచి ఎంతో నేర్చుకున్నాను’ అని గోపీచంద్ మలినేని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా గోపీచంద్ మలినేని తన తర్వాతి సినిమాను నందమూరి నటసింహం బాలకృష్ణతో చేయనున్నాడని తెలుస్తోంది.