భారీ రేటుకు అమ్ముడుపోయిన క్రాక్ డిజిటల్ రైట్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా గోపీచంద్ మలినేని తెరకెక్కించిన క్రాక్ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సంపాదించుకుంటోంది. రవితేజ గత రెండు సినిమాలు అంతగా ఆడకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఇప్పుడు క్రాక్ సినిమాతో తన అభిమానులను అలరించిన రవితేజ.. తన ఖాతాలో మరోన విజయాన్ని వేసుకున్నాడు. కలెక్షన్లు కూడా బాగానే రావడంతో నిర్మాతలు కూడా సేఫ్ అయినట్లు తెలుస్తోంది.

krack digital rights

అయితే తాజాగా క్రాక్ డిజిటల్ రైట్స్‌ను అల్లు అరవింద్‌కి చెందిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ ఆహా దక్కించుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు రూ.8.2 కోట్లు పెట్టి ఆహా యాప్ కొనుగోలు చేసినట్లు సమాచారం. క్రాక్ డిజిటల్ రైట్స్ ఇంత భారీ మొత్తానికి అమ్ముడుపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ నెల చివరివారం నుంచి ఈ సినిమా ఆహా యాప్‌లో స్ట్రీమింగ్ కానుంది.