స్పిరిట్‌లో ప్రభాస్‌తో కలిసి నటించనున్న కొరియన్ స్టార్ మా డాంగ్ సియోక్?

మ డాంగ్ సియోక్ అనే కొరియన్ నటుడు సుమారు అందరు సినిమా ప్రేమికులుకు తెలిసిన వాడే. ట్రైన్ టూ బూసన్ తో అతను ఇండియాలో కూడా చాలా ఫేమస్ అయ్యాడు. అంతే కాక అతను అనేక కొరియన్ సినిమాలలో నటించాడు. అయితే తాజా వార్త ఏంటి అంటే అతను సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రాబోతున్న స్పిరిట్ సినిమాలో నటించనున్నాడు అని. ప్రభాస్ కథానాయకీడుగా రాబోతున్న ఈ సినిమాలో ప్రభాస్ కు విల్లన్ గా మ డాంగ్ సియోక్ నటించనున్నట్లు సమాచారం. ఇందుకుగాను అతనికి సుమారు 10 కోట్ల రూపాయిలు పారిదోషంగా చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. మార్వెల్స్ ఏటర్నల్స్, ది రౌండప్, ది అవుట్లాస్ వంటి సినిమాలలో అతను నటించాడు.