మెగా అభిమానులు మిస్ అయ్యింది, ఇవ్వడానికి రెడీ అయిన కొరటాల

సైరా సినిమాతో కాసుల వర్షం కురిపించిన మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివతో కలిసి ఒక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. చిరు పక్కన ఈషా రెబ్బ, త్రిషా హీరోయిన్లుగా నటించనున్న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ వచ్చే యేడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఎప్పుడూ ఎమోషనల్ సీన్ తోనో, సినిమాలోని ఇంపార్టెంట్ సినిమాతో షూటింగ్ మొదలుపెట్టే కొరటాల శివ, ఈసారి మాత్రం తన అలవాటుని కాస్త చేంజ్ చేసుకున్నట్లు ఉన్నాడు.

chiru koratala

దేవాదాయ శాఖలో జరిగే అక్రమాల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కనున్న ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో స్టార్ట్ కానుంది. ఫస్ట్ షెడ్యూల్ లోనే సాంగ్ షూట్ చేసేలా కొరటాల ప్లాన్ చేస్తున్నాడట. సైరాకి మ్యూజిక్ ఇచ్చిన అమిత్ త్రివేది ఈ మూవీకి కూడా సంగీతం అందిస్తున్నాడు. మొదటగా రెండేళ్ల నుంచి మిస్ అవుతున్న చిరు స్టైల్ ని చూపించే రేంజులో సాగనున్న ఈ పాటతో షూటింగ్ మొదలుపెట్టి… ఆ తర్వాత యాక్షన్, ఎమోషన్ సీన్స్ చిత్రీకరించాలని కొరటాల ప్లాన్ చేసినట్టు సమాచారమ్.