Kollywod Star: నా భార్య‌, త‌మ్ముడికి ఉన్నంత ఆత్మ‌విశ్వాసం నాకు లేదు: సూర్య

Kollywod Star: కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. త‌న సినిమాల‌తో త‌మిళంతో పాటు తెలుగులోనూ ఎంతో మంది ఫ్యాన్ ఫాలోవ‌ర్స్‌ను సంపాదించుకున్నాడు. అయితే సూర్య న‌టించిన ఆకాశం నీ హ‌ద్దురా సినిమా మంచి విజ‌యాన్ని సొంతం చేసుకుంది. సుధ కొంగ‌ర ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమాలో సూర్య న‌ట‌నకు ప్రేక్ష‌కులంద‌రు ఫిదా అయిపోయారు.

అయితే.. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో Kollywod Star సూర్య త‌న న‌ట‌న‌పై కొన్ని ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. తాను న‌టించిన సినిమాలు 100రోజులు దాటిన త‌ర్వాతే తాను వాటిని చూస్తుంటాన‌ని సూర్య అన్నారు. ఎందుకంటే.. త‌న న‌ట‌న‌పై త‌న‌కే అంత విశ్వాసం ఉండ‌ద‌నీ.. కొన్ని కొన్ని స‌న్నివేశాల్లో త‌న న‌ట‌న చూసి తానే సిగ్గుపడుతుంటాన‌ని చెప్పుకొచ్చాడు. కానీ తన భార్య జ్యోతిక, సోద‌రుడు కార్తి మాత్రం వారు న‌టించిన సినిమాల విష‌యంలో చాలా ఆత్మ‌విశ్వాసంతో ఉంటార‌ని Kollywod Star సూర్య చెప్పాడు. తాను మాత్రం అలా ఉండ‌లేన‌ని వివ‌రించాడు. అలాగే తాను 20ఏళ్లుగా సినిమాల్లో న‌టిస్తున్న‌ప్ప‌టికీ, త‌న సినిమాల విష‌యంలో విశ్వాసంతో ఉండ‌లేనని తెలిపాడు. ఒక‌వేళ తాను న‌టించిన సినిమాను ప్రేక్ష‌కులు బాగా ఆదరిస్తే అది వారి పెద్ద మ‌న‌స్సు వ‌ల్లే అని భావిస్తుంటాన‌ని Kollywod Star సూర్య పేర్కొన్నాడు.