సామూహిక అత్యాచారాల నేపధ్యంలో సూర్య సినిమా

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గత కొంతకాలంగా సక్సెస్‌లకు దూరంగా ఉన్నాడు. ఆయన నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన విధంగా విజయాలను అందుకోలేకపోయాయి. అయితే ఎంతో కసితో బయోపిక్ సినిమాలో నటించి మంచి కమర్షియల్ హిట్ అందుకున్నాడు. తమిళంలో సూరారై పోట్రు, తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ అనే టైటిల్ తో వచ్చి భారీ విజయం అందుకుంది. కెప్టెన్ గోపీనాథ్ నిజ జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా తయారైన కథతో రూపొందిన ఈ  సినిమా.. బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. ఒకేసారి తెలుగు, తమిళంలో హిట్ అందుకున్న సూర్య తర్వాత క్రేజీ ప్రాజెక్ట్స్ లైన్ లో పెట్టారు. లేడీ డైరెక్టర్ సుధాకొంగర చేసిన మ్యాజిక్ తో సూర్య మళ్ళీ ఫాంలోకి వచ్చాడు.

ఇక తమిళ పాపులర్ డైరెక్టర్ పాండిరాజ్ దర్శకత్వంలో సూర్య ఓ సినిమా చేస్తున్నాడు. ఇది ఆయన కెరీర్ లో 40వ సినిమా. మైల్ స్టోన్ మూవీ కావడంతో సూర్య ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. గ్యాంగ్ లీడర్, శ్రీకారం చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపిక చేసుకున్నారు. కాగా త్వరలో ఈ సినిమా నుంచి సూర్య ఫస్ట్ లుక్ రిలీజ్ కాబోతుంది. సూర్యకు 40వ చిత్రం.. పాండిరాజ్ డైరెక్టర్ అనగానే అటు కోలీవుడ్ ప్రేక్షకులతో పాటు ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా ఊహించని విధంగా అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాను దర్శకుడు పాండిరాజ్ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించబోతున్నాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. గతంలో పొల్లాచ్చిలో చోటు చేసుకున్న సామూహిక అత్యాచారాల గురించి అందరికీ తెలిసిందే. దేశ వ్యాప్తంగా ఈ ఘటన ఎంతో సంచలనం సృష్టించింది. ఇప్పుడు సూర్య 40 ఈ సంఘటనల ఆధారంగానే తెరకెక్కబోతోందని చెప్పుకుంటున్నారు. ఇందులో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతున్న దుర్మార్గుల అంతం చూసే పాత్రలో సూర్య నటించబోతున్నాడట. ఇక జూలైలో టైటిల్ రిలీజ్ చేస్తానని సోషల్ మీడియాలో ప్రకటించారు చిత్ర బృందం.