ఎప్పుడూ మౌనంగా ఉండే వాడు లీగల్ నోటిస్ ఇచ్చాడు

తల అజిత్… రజినీకాంత్ తర్వాత కోలీవుడ్ లో అంతటి స్టార్ ఫాలోయింగ్ ఉన్న హీరో. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో తన పని తాను చేసుకుంటూ వెళ్లే అజిత్ కి తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా మంచి వాడు, మితభాషి అనే పేరుంది. ఎంత మితభాషి అయినా తన పేరుపై ఏదైనా చెడ్డ వార్త బయటకి వస్తే మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వడంలో ముందుంటాడు. ప్రస్తుతం అజిత్ వాలిమై సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే ముందే అజిత్ నుంచి ఒక లీగల్ నోటిస్ బయటకి వచ్చింది.

ఇండస్ట్రీలో తన పేరుతో ఎవరు ఏం చెప్పిన వినకండని… అజిత్ అఫీషియల్ విషయాలు ఏమున్నా, వాటిని సురేష్ చంద్రనే చూస్తారని.. వేరే ఎవరి నుంచి ఎలాంటి న్యూస్ వచ్చినా, మోసం జరిగిన దానికి అతను బాధ్యుడు కాదు అనేది ఈ లీగల్ నోటిస్ లో క్లారిటీ ఇచ్చాడు. తన పేరుపై జరిగే మొసలి అజిత్ కండించడంలో తప్పు లేదు కానీ అసలు ఎవరు ఎవరిని మోసం చేస్తున్నారు? ఎలాంటి మోసం చేస్తున్నారు అనేది మాత్రం ఇంకా బయటకి రాలేదు.