Dhanush: ధ‌నుష్ కొత్త ఇల్లు ప్రారంభోత్స‌వానికి సూప‌ర్‌స్టార్‌..

Dhanush: కోలీవుడ్ స్టార్ ధ‌నుష్ నూత‌న గృహ పూజా కార్య‌క్ర‌మానికి సూప‌ర్‌స్టార్ ర‌జనీకాంత్ హాజ‌ర‌య్యారు. చెన్నైలోని పోయేస్ గార్డెన్ ప్రాంతంలో Dhanush ధ‌నుష్ త‌న కొత్త ఇంటిని నిర్మిస్తున్నాడు. దివంగ‌త ప్ర‌ముఖ న‌టి, త‌మిళ‌నాడు సీఎం జ‌య‌ల‌లిత వేద హోమ్‌, సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ఇల్లు రాఘ‌వ‌వీర అవెన్యూస్ ద‌గ్గ‌ర్లోనే త‌న కొత్త ఇల్లు నిర్మిస్తున్నాడు ధ‌నుష్‌. ఇటీవ‌లే ఈ ప్రాంతంలో భూమిని కొని నేడు పూజా కార్య‌క్ర‌మాన్ని చేపట్టగా..

ఈ కార్య‌క్ర‌మానికి ర‌జ‌నీతో పాటు త‌న కుటుంబ‌స‌భ్యులు హ‌జ‌ర‌య్యారు. ఇదిలా ఉంచితే.. సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం అన్నాత్తే షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రాన్ని శివ డైరెక్ష‌న్‌లో తెర‌కెక్కిస్తుండ‌గా.. ఈ చిత్ర షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకుంది.. త్వ‌ర‌లో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. అలాగే కోలీవుడ్ స్టార్Dhanush ధ‌నుష్ కూడా ప‌లు సినిమాల‌తో బిజీగా ఉన్నాడు. త‌మిళ్‌లోనే కాకుండా బాలీవుడ్‌లో స్టార్ హీరో అక్ష‌య్‌కుమార్‌తో న‌టిస్తున్నాడు ధ‌నుష్‌.