కిరణ్ అబ్బవరం ఐదో సినిమా కొడి రామకృష్ణ గారి కుటుంబంతో…

సెంటిమెంట్ – భక్తికి గ్రాఫిక్స్ జోడించి ట్రెండ్ క్రియేట్ చేసిన శతాధిక దర్శకుడు కొడి రామకృష్ణ. అమ్మోరు, దేవి, అరుంధతి లాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమాలని ఇచ్చిన కొడి రామకృష గారు అనారోగ్యంతో 2019 ఫిబ్రవరి 22న కోడి రామకృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన కూతురు దివ్య, కొడి దివ్య ఎంటర్టైన్మెంట్స్ అనే బ్యానర్ ని స్థాపించి సినిమాని ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యింది.

‘కోడి దివ్య ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి సినిమాల నిర్మాణం చేపట్టనున్నట్లు ప్రకటించిన దివ్య, తన ప్రొడక్షన్ హౌజ్ నుంచి రానున్న తొలి చిత్రాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. కార్తీక్ శంకర్ అనే కొత్త డైరెక్టర్‌కు అవకాశం ఇచ్చిన దివ్య, మ్యూజిక్ కోసం మణిశర్మని రంగంలోకి దించింది. ఇవన్ని సరే అసలు హీరో ఎవరు అనే కదా మీ డౌట్, మోస్ట్ వాంటెడ్ యంగ్ హీరోస్ లో ఒకడిగా ఉన్న కిరణ్‌ అబ్బవరం ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అతని 5వ సినిమాగా ఈ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లనుంది. ఇప్పటికే ఎస్.ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్, సమ్మతమే సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం ఈ కొత్త ప్రాజెక్ట్ కొడి రామకృష్ణ లాంటి లెజెండరీ ఫ్యామిలీతో చేస్తున్నందుకు హ్యాపీగా ఫీల్ అవుతూ ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. ఈ #KA5 మూవీలో ఇతర నటీనటుల, సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది.