మెగా హీరో సినిమాలో ఛాన్స్ మిస్ చేసుకున్న మహేశ్ హీరోయిన్

మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ వాల్మీకీ తర్వాత ఒక స్పోర్ట్స్ సినిమా చేస్తున్నాడు. ఇటీవలే గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాక్సింగ్ నేర్చుకుంటున్నాడు. కిరణ్ కొర్రపాటి తెరకెక్కించనున్న ఈ సినిమాలో హీరోయిన్ గా భరత్ అనే నేను బ్యూటీ కియారా అద్వానీని తీసుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారట. తెలుగులో అవకాశాలు లేని కియారా, బాలీవుడ్ లో కబీర్ సింగ్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో బాలీవుడ్ లో కియారా డిమాండ్ బాగా పెరిగింది. ఇలాంటి సమయంలో వరుణ్ తేజ్ సినిమాలో ఆమె నటించడం మూవీకి ప్లస్ అయ్యే విషయమే అయినా డేట్స్ ఎంత వరకూ దొరుకుతాయి అనేది ఆలోచించాల్సిన విషయం.

హిందీలో వరస ప్రాజెక్ట్స్ చేస్తున్న కియారా, మళ్లీ ఇప్పుడు తెలుగులో చేసే అవకాశం కనిపించట్లేదు. ఒకవేళ ఆమె ఓకే చెప్పినా, డేట్స్ ఇవ్వడానికి టైం పడుతుంది. ఈ సమయంలో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ అయ్యింది కాబట్టి హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ టైం డిలే చేయడం కన్నా వేరే హీరోయిన్ ని ఫైనల్ చేసి సెట్స్ పైకి వెళ్లాలని వరుణ్ తేజ్ భావిస్తున్నాడట. కియారా ప్లేస్ లో మరో క్రేజీ హీరోయిన్ ని సెట్ చేసే పనిలో మేకర్స్ ఉన్నారట. ఇప్పటికే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పక్కన నటించిన కియారా, ఇప్పుడు మరో హీరో పక్కన నటించే ఛాన్స్ మాత్రం మిస్ చేసుకుంది.