ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ హీరోయిన్

ఆ మధ్య బాలీవుడ్ హీరోయిన్స్ తెలుగు హీరోల పక్కన సినిమాలు చేసేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ తెలుగులో భరత్ అనే నేను, వినయ విధేయ రామా సినిమాలో నటించింది. తాజాగా ఎన్టీఆర్‌తో రోమాన్స్ చేసేందుకు రెడీ అయిపోయింది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌తో సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారాను తీసుకోనున్నారట.

KIRA ADVANI

ఎన్టీఆర్ సరసన కియారా అయితే బాగుంటుందని త్రివిక్రమ్ భావించాడట. ఎన్టీఆర్‌తో కలిసి నటించేందుకు కియారా కూడా ఓకే చెప్పేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం అనేకమంది హీరోయిన్ల పేర్లను అనుకున్నారు. పూజాహెగ్దే, రష్మిక లాంటి హీరోయిన్ల పేరు వినిపించాయి. కానీ చివరికి కియారా అద్వానీని ఎంపిక చేసినట్లు సమాచారం.

గతంలో త్రివిక్రమ్-ఎన్టీఆర్ కాంబినేషన్‌లో వచ్చిన అరవింద సమేత వీరరాఘవ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో వీరిద్దరు కాంబోలో రాబోతున్న రెండో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చేస్తున్న RRR షూటింగ్ అయిపోయిన తర్వాత త్రివిక్రమ్ సినిమాలో ఎన్టీఆర్ నటించనున్నాడు.