రైడ్ రీమేక్ చేస్తున్నాడా? బంగార్రాజు చేస్తున్నాడా?

మన్మథుడు2 సినిమా రిలీజ్ అయ్యి చాలా కాలం అయినా మరో సినిమాని అనౌన్స్ చేయని కింగ్ నాగార్జున, ప్రస్తుతం బాలీవుడ్ సినిమాతో పాటు కోలీవుడ్ మూవీలో కూడా ఇంపార్టెంట్ రోల్స్ చేస్తున్నాడు. తెలుగులో సోగ్గాడే సినిమాకి ప్రీక్వెల్ అయిన బంగార్రాజు సినిమాని అనౌన్స్ చేయబోతున్న నాగార్జున, ఒక హిందీ సినిమాని రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని సమాచారం. అజయ్ దేవగన్ హీరోగా రాజ్ కుమార్ గుప్త తెరకెక్కించిన సినిమా రైడ్. 1980లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమా 50 కోట్ల బడ్జట్ తో తెరకెక్కి 140 కోట్లు రాబట్టింది. ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా అజయ్ దేవగన్ రియాలిటీకి దగ్గరగా నటించి సినీ అభిమానులని మెప్పించాడు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాని తెలుగులో నాగార్జున రీమేక్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడు.

nagarjuna raid

ప్రస్తుతం రియాలిటీ షో బిగ్‌బాస్ 3తో బిజీగా ఉన్న నాగార్జున, ఇది పూర్తి కాగానే నాగార్జున రైడ్ సినిమాపై ద్రుష్టి పెట్టె అవకాశం ఉందట. ఏషియన్ సినిమాస్ అధినేత సునీల్ నారంగ్, ఈ సినిమాని తెలుగులో నిర్మించడానికి రెడీ అయ్యాడని సమాచారం. హిందీలో నటించిన ఇలియానానే, తెలుగు మూవీలో కూడా నటించనుందని తెలుస్తోంది. మరి నాగార్జున బిగ్ బాస్3 తర్వాత బంగార్రాజుని మొదలు పెడతాడా లేక రైడ్ రీమేక్ అనౌన్స్ చేస్తాడా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాలి.