కింగ్ నాగార్జున అక్కినేని ‘నా సామిరంగ’ మ్యూజికల్ సిట్టింగ్స్ బిగిన్స్….

కింగ్ నాగార్జున అక్కినేని, ఆస్కార్, జాతీయ అవార్డుల విజేత ఎంఎం కీరవాణి లది మోస్ట్ సక్సెస్ ఫుల్ కాంబినేషన్. వీరి కాంబినేషన్ లో ఎన్నో చార్ట్ బస్టర్ ఆల్బమ్స్ ప్రేక్షకులని అద్భుతంగా అలరించాయి. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ జతకట్టారు. కింగ్ నాగార్జున మోస్ట్ అవైటెడ్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ ‘నా సామిరంగ’. పాపులర్ కొరియోగ్రాఫర్ విజయ్ బిన్ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రారంభమైయ్యాయి. ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ పాటలకు లిరిక్స్ సమకూరుస్తున్నారు. ఈ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ లో వస్తున్న ‘నా సామిరంగ’ ఆల్బమ్ సంచలనం సృష్టిస్తుందని చెప్పడంలో సందేహం లేదు.

టాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్‌ నిర్మాత శ్రీనివాస చిట్టూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. రిచ్ ప్రొడక్షన్ డిజైన్, అత్యుత్తమ టెక్నికల్ స్టాండర్డ్స్ తో రూపొందుతోంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ మైసూర్ లో జరుగుతోంది.

ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. నాగార్జున మాస్ లుక్‌, ఎక్స్ టార్డీనరీ ప్రెజెన్స్ ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసి అంచనాలను అమాంతం పెంచింది.

ఇందులో విభిన్న క్రాఫ్ట్‌ లలో పాపులర్ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. బ్లాక్ బస్టర్ రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడ ఈ చిత్రానికి కథ, డైలాగ్స్ అందిస్తున్నారు.

‘నా సామిరంగ’ 2024 సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది.

తారాగణం: కింగ్ నాగార్జున అక్కినేని, కరుణ కుమార్

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: విజయ్ బిన్ని
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సంగీతం: ఎంఎం కీరవాణి
లిరిక్స్: చంద్రబోస్
సమర్పణ: పవన్ కుమార్
కథ, డైలాగ్స్: ప్రసన్న కుమార్ బెజవాడ
పీఆర్వో: వంశీ-శేఖర్