మంచి చిత్రాలు నిర్మించ‌ట‌మే పారిజాత‌ మూవీ క్రియేష‌న్స్ ల‌క్ష్యం….

కిల్ల‌ర్‌, మిస్ట‌ర్ కెకె లాంటి చిత్రాల‌తో తెలుగు సిని ప‌రిశ్ర‌మ‌కి ప‌రిచ‌యమ‌య్యిన నిర్మాత‌లు టి న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్ లు పారిజాత మూవీ క్రియోష‌న్స్ బ్యాన‌ర్ లో ప‌లు చిత్రాలు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇటీవ‌ల విడుద‌ల‌య్యిన విక్ర‌మ్ న‌టించిన మిస్ట‌ర్ కెకె మంచి క‌లెక్ష‌న్ల తో విజ‌య‌వంతం గా ర‌న్ అవుతుంది

ఈ సంద‌ర్బంగా నిర్మాత‌లు టి.న‌రేష్ కుమార్‌, టి.శ్రీధ‌ర్ లు మాట్లాడుతూ.. మేము బిజినెస్ లో చాలా స‌క్స‌స్‌ఫుల్ గా వున్నాము. కాని సినిమా మీద వున్న ఫ్యాష‌న్ తో చిత్ర నిర్మాణం లోకి అడుగుపెట్టాము. మెము పారిజాత మూవీ క్రియెష‌న్స్ బ్యాన‌ర్ స్టాపించి, మెద‌టి చిత్రం గా విజ‌య్ ఆంటోని హీరోగా చేసిన కిల్ల‌ర్ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల చేశాము. ఆ చిత్రం మౌత్ టాక్ తో చ‌లా మంచి లాభాలు తెచ్చిపెట్టింది.

అలాగే విక్ర‌మ్ , అక్ష‌ర హ‌స‌న్ న‌టించిన చిత్రం మిస్ట‌ర్ కెకె ని ఈనెల 19 న విడుద‌ల చేశాము. ఒక్క ప‌క్క తెలుగు చిత్రాలు వున్న‌ప్ప‌టికి మా మిస్ట‌ర్ కెకె మంచి మౌత్ టాక్ తో ఆక‌ట్టుకుంటుంది. మా బ్యాన‌ర్ లో చేసిన రెండు చిత్రాలు మాకు మంచి పేరు తీసుకురావ‌టం చాలా ఆనందంగా వుంది. త్వ‌ర‌లో డైర‌క్ట్ తెలుగు చిత్రం చేయ‌బోతున్నాము.. క‌థా చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. తెలుగు సినిమా ఇండ‌స్ట్రి లో చాలా మంచి స్టేజి మా సంస్థ ఎద‌గాల‌ని కొరుకుంటున్నాము.. అని అన్నారు