‘ప‌హిల్వాన్‌’ ట్రైల‌ర్ విడుద‌ల‌… సెప్టెంబ‌ర్ 12న గ్రాండ్ రిలీజ్‌

శాండిల్ వుడ్ బాద్షా..`ఈగ` ఫేమ్ కిచ్చా సుదీప్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న చిత్రం `ప‌హిల్వాన్‌`.  ఎస్‌.కృష్ణ ద‌ర్శ‌కుడు. ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ డ్రామాలో సుదీప్ రెజ్ల‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తారు. తెలుగులోనూ `ప‌హిల్వాన్‌` అనే పేరుతో సెప్టెంబ‌ర్ 12న‌ ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు ప్లాన్ చేస్తున్నారు. 


ఈ చిత్రంలో బాలీవుడ్ న‌టుడు సునీల్ శెట్టి, ఆకాంక్ష సింగ్ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. ఇటీవ‌ల మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన `ప‌హిల్వాన్` ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. గురువారం ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.  ఈ ట్రైల‌ర్‌కు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌స్తుంది. 


అర్జున్ జ‌న్యా సంగీతం అందించిన ఈ సినిమాకు క‌రుణాక‌ర్ సినిమాటోగ్ర‌ఫీ అందించారు. `కె.జి.య‌ఫ్‌` చిత్రాన్ని తెలుగులో విడుద‌ల చేసి ఘ‌న విజ‌యాన్ని అందుకున్న వారాహి చ‌ల‌న చిత్రం ఇప్పుడు `ప‌హిల్వాన్‌` చిత్రాన్ని సెప్టెంబ‌ర్ 12న  గ్రాండ్ రిలీజ్ చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 

న‌టీన‌టులు:
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.కృష్ణ‌
బ్యాన‌ర్‌:  వారాహి చ‌ల‌న చిత్రం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌:  ఎస్‌.దేవ‌రాజ్‌
కెమెరా:  క‌రుణాక‌ర్‌.ఎ
ఎడిట‌ర్‌:  రూబెన్‌
ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  శివ‌కుమార్‌
కుస్తీ:  ఎ.విజ‌య్‌
బాక్సింగ్‌:  లార్లెల్ స్టోవాల్‌
స్టంట్స్‌:  రామ్ లక్ష్మ‌ణ్, కె.ర‌వివ‌ర్మ‌
కొరియోగ్ర‌ఫీ:  గ‌ణేశ్ ఆచార్య‌, రాజు సుంద‌రం
ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌:  సాగ‌ర్ గౌడ‌
స్క్రీన్‌ప్లే:  కృష్ణ‌, మ‌ధు, క‌న్న‌న్‌
డైలాగ్స్‌:  హ‌నుమాన్ చౌద‌రి
పాట‌లు:  రామ‌జోగయ్య‌శాస్త్రి
వి.ఎఫ్‌.ఎక్స్:  రెడ్ చిల్లీస్‌, లైబ్రింత్‌
డి.ఐ: ప‌్ర‌సాద్ ల్యా్స్‌(ముంబై)
కాస్ట్యూమ్స్‌:  యోగి, చేత‌న్‌, గ‌ణేశ్‌
ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్‌:  మైసూర్ సురేశ్‌
డైరెక్ష‌న్ టీం:  వికాస్ విశ్వ‌నాథ్‌, ప్ర‌ద్యుమ్న న‌ర‌హ‌ల్లి, అనీల్ విజ్జి, తేజ్ వ‌ర్ధ‌న్‌
స్టిల్స్:  క‌దూర్ ర‌ఘు 
ప‌బ్లిసిటీ డిజైన్‌:  ధ‌ని ఏలే, కానీ స్టూడియో