ఘనంగా ఖుషి డాన్స్ స్టూడియో తొలి వార్షికోత్సవ వేడుకలు

హీరో రాజు, తన భార్య సుహానా కలిసి తన కూతురు ఖుషి పేరు మీద తమ కలలు సహకారం చేసుకునే విధంగా మొదలుపెట్టిన ఖుషి డాన్స్ స్టూడియో ప్రారంభమై సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా కూకట్పల్లిలోని వారి డాన్స్ స్టూడియో వద్ద తొలి వార్షికోత్సవ వేడుకలు చేసుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కుతుబుల్లా నియోజకవర్గ ఎమ్మెల్యే కేపీ వివేకానంద గారు హాజరయ్యారు. అలాగే చిత్రం శ్రీను, సోదర చిత్ర నటుడు సంజోష్, అన్వేషి చిత్ర నిర్మాత కిరణ్ కందుల గారు, కొరియోగ్రాఫర్ బాబి, పంచ్ ప్రసాద్ ఇంకా మరికొందరు సినీ సెలబ్రిటీలు, కొరియోగ్రాఫర్లు, డాన్సర్స్ పాల్గొని ఈ వేడుకను మరింత ఘనవిజయం చేశారు. ఈ సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకుంటున్న స్టూడెంట్స్ తో కొన్ని డాన్స్ ప్రోగ్రాములు చేసి తమ ప్రతిభను చాటి చెప్పకుంటూ ఆ వేడుకను మరింత కళాత్మకంగా చేశారు.

ఈ సందర్భంగా సోదర చిత్ర నటుడు సంజోష్ మాట్లాడుతూ… “డాన్స్ చేయడం అనేది ఎంత కష్టమైన విషయమో నటుడుగా నాకు తెలుసు. పిల్లలు చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. భవిష్యత్తులో మీరు మరింత బాగా చేసి ఉన్నత స్థాయికి వెళ్లాలి. అలాగే ఖుషి డాన్స్ స్టూడియో మరిన్ని ఇటువంటి వార్షికోత్సవాలు చేసుకుంటూ బాగా ఎదగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

నటుడు చిత్రం శ్రీను మాట్లాడుతూ… “ఖుషి డాన్స్ స్టూడియోస్ రాజు అంటే మాకు చాలా కావాల్సిన వారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగిన కుటుంబ సమేతంగా వస్తారు. తొలి వార్షికోత్సవం చేసుకున్నందుకు శుభాకాంక్షలు. ఇటువంటి మరెన్నో వార్షికోత్సవాలు చేసుకోవాలని కోరుకుంటున్నాను” అన్నారు.

సుహాన గారు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు. మీ అందరి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను. మమ్మల్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ మరోసారి ప్రత్యేక ధన్యవాదాలు” అన్నారు.

ఖుషి డాన్స్ స్టూడియోస్ అధినేత, అందరికీ సుపరిచితుడు, చారితో పూరి, వైతరణి రాణ, i20 చిత్ర నటుడు రాజు మాట్లాడుతూ… “ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరుపేరునా నా నమస్కారం. నాకు డాన్స్ స్టూడియో గురించి అంతగా తెలియదు. నా మిత్రుడు సురేష్ నా వెనుక ఉండి సపోర్ట్ చేయడం వల్ల అలాగే మీరంతా నాకు అండగా నిలబడటం వల్ల నేను ఈరోజు ఇంతగా ఎదుగుతున్నాను. భవిష్యత్తులో కూడా మీ అందరి సపోర్ట్ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను” అన్నారు.

ఈ వేడుకల సందర్భంగా తమ దగ్గర డాన్స్ నేర్చుకున్న పిల్లలు డాన్స్ పెర్ఫార్మన్స్ చేసి తమ ప్రతిభను చూపించారు. అలాగే ఈ వేడుకకు హాజరైన వారందరికీ చెడు సత్కారంతో గౌరవించరు.