ఖిలాడిలోకి వెన్నెల కిషోర్‌కి వెల్ కమ్

క్రాక్ సినిమాతో హిట్ కొట్టిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ఖిలాడి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రమేశ్ వర్మ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. ఇందులో యాక్షన్ హీరో అర్జున్ కీలక పాత్రలలో నటించనున్నాడు. అర్జున్‌ది విలన్ రోల్ అని తెలుస్తోంది. ఇక ఇందులో జబర్దస్త్ యాంకర్ అనసూయ నటించనున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు.

khiladi welcome vennela kishore

ఈ క్రమంలో ఖిలాడి యూనిట్ మరో కీలక ప్రకటన చేసింది. ఇందులో కమెడియన్ వెన్నెల కిషోర్ నటించనున్నట్లు తాజాగా ఖిలాడి మేకర్స్ ప్రకటించారు. వెల్ కమ్ చెబుతూ ఒక పోస్టర్ విడుదల చేశారు. కాగా గతంలో రవితేజతో వీరా అనే సినిమాను రమేష్ వర్మ తెరకెక్కించగా.. అది అంతగా హిట్ కాలేదు.