‘ఖిలాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో ఖాలాడి అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ని మేకర్స్ ప్రకటించారు. సమ్మర్ స్పెషల్‌గా మే 28న రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘ఈ సమ్మర్‌కి డబుల్ మాస్ ఎంటర్‌టైనర్ ఖిలాడీ థియేటర్లలోకి రానుంది’ అని సినిమా యూనిట్ ట్వీట్ చేసింది.

Khiladi Release Date

ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ విలన్‌గా నటించనున్నట్లు ఇటీవలే సినిమా యూనిట్ ప్రకటించింది. దీంతో రవితేజ, అర్జున్ కాంబినేషన్‌పై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఖిలాడీ పోస్టర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇటీవలే విడుదలైన క్రాక్ సినిమాతో మాస్ మహారాజా హిట్ అందుకుని మంచి ఫామ్‌లో ఉన్నాడు. 50 శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లు నడుస్తున్న సమయంలో కూడా క్రాక్ భారీ వసూళ్లు సాధించింది. రవితేజ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్ సినిమాగా క్రాక్ నిలిచింది.