కార్తీ ఖైదీ దర్శకుడితో లోక నాయకుడు వర్క్ చేస్తాడా?

కార్తీ నటించిన ఖైదీ సినిమా దీపావళికి ప్రేక్షకుల ముందుకి వచ్చి సూపర్ హిట్ అయ్యింది. కేవలం నాలుగు గంటల్లో జరిగే కథతో, ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఈ మూవిని లోకేష్ డైరెక్ట్ చేశాడు. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ డైరెక్టర్ కి కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. కోలీవుడ్ స్టార్స్ అయితే కాంప్లిమెంట్స్ కాదు ఏకంగా ఆఫర్స్ ఇస్తున్నారు. ఖైదీ రిలీజ్ కి ముందే పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడంతో లోకేష్ ని దళపతి విజయ్ పిలిచి మరీ ఛాన్స్ ఇచ్చాడు. రీసెంట్ గా ఈ మూవీ లాంఛనంగా ప్రారంభం అయ్యింది.

విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్ గా నటించే ఈ సినిమా సెట్స్ పై ఉండగానే, లోకేష్ కి మరో భారీ ఆఫర్ వచ్చింది. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో భారతీయుడు 2 సినిమా చేస్తున్న కమల్, ఖైదీ సినిమా చూసి లోకేష్ తో మూవీ చేయాలని సొంత బ్యానర్ లోనే సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. లోకేష్ కూడా లోకనాయకుడిని డైరెక్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించడంతో, ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ త్వరలోనే ఫైనల్ అయ్యే అవకాశం ఉంది.