చరిత్ర సృష్టించిన కేజీఎఫ్-2 టీజర్

కేజీఎఫ్-2 టీజర్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్ ట్రెండింగ్‌లో తొలి స్థానంలో కొనసాగుతున్న ఈ టీజర్.. విడుదలైన 12 గంటల్లోనే 20 మిలియన్ల వ్యూస్ సాధించింది. అంతేకాకుండా విడుదలైన 79 నిమిషాల్లోనే 1 మిలియన్ లైక్స్ సంపాదించి రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు సౌత్ ఇండియాలో ఇంత తక్కువ వ్యవధిలో ఏ సినిమా టీజర్‌కు ఇన్ని లైక్స్ రాలేదు. దీంతో ఈ టీజర్ దాని పరంగా రికార్డు సృష్టించిందని చెప్పవచ్చు.

KGF2 TEASER RECORDS

హీరో యశ్ బర్త్ డే సందర్భంగా ఇవాళ ఈ టీజర్‌ను రిలీజ్ చేయాలని ముందుగా సినిమా యూనిట్ ప్రకటించింది. ఇవాళ ఉదయం 10.18 నిమిషాలకు విడుదల చేయాలని అనుకున్నారు. కానీ సినిమాకు సంబంధించిన కొన్ని స్టిల్స్ లీక్ కావడంతో.. వెంటనే సినిమా యూనిట్ టీజర్‌ను విడుదల చేసింది. కాగా నిన్న రాత్రి 9.29 గంటలకు ఈ టీజర్ విడుదలైంది.