పాన్ ఇండియా సినిమాలో సూపర్ స్టార్…

ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్ సెట్ అవుతున్నాయి అనే మాట బయటకి రాగానే అభిమానులతో పాటు, ఇండస్ట్రీ వర్గాలు కూడా ఆ ప్రాజెక్ట్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. రీసెంట్ గా ఫిల్మ్ నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న ఇలాంటి ప్రాజెక్ట్స్ ఒకటి ప్రశాంత్ నీల్, మహేశ్ బాబు సినిమా. కేజీఎఫ్ సినిమాతో సూపర్ హిట్ అందుకోని నేషనల్ వైడ్ ఫేమ్ తెచ్చుకున్న దర్శకుడు ప్రశాంత్ నీల్, ప్రస్తుతం కేజీఎఫ్ 2 తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్… అది అయ్యాక సూపర్ స్టార్ మహేశ్ బాబుతో మూవీ చేసే ఆలోచనలో ఉన్నాడట.

ఇప్పటికే ప్రశాంత్ నీల్, మహేశ్ బాబుని కలిసి లైన్ న్యారేట్ కూడా చేశాడని, ప్లాట్ విని పాజిటివ్ గా రియాక్ట్ అయిన మహేశ్ ఫుల్ లెంగ్త్ న్యారేషన్ కోసం కథని సిద్ధం చేయమని ప్రశాంత్ నీల్ కి చెప్పాడట. ప్రస్తుతం కేజీఎఫ్ 2 సినిమాని తెరకెక్కిస్తున్న ప్రశాంత్ నీల్, ఆ ప్రాజెక్ట్ అయిపోయాక మహేశ్ కోసం కథని సిద్ధం చేసి సూపర్ స్టార్ కి న్యారేషన్ ఇవ్వనున్నాడని సమాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం మహేశ్ ని మొదటిసారి పాన్ ఇండియా ఫిల్మ్ లో చూడడానికి ఘట్టమనేని అభిమానులు రెడీగా ఉన్నారు.