రాకింగ్ స్టార్ య‌ష్‌ `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2 ఫ‌స్ట్ లుక్

KGF Chapter 2 First Look

రాకింగ్ స్టార్ య‌ష్ హీరోగా.. కైకాల స‌త్య‌నారాయ‌ణ స‌మ‌ర్ప‌ణ‌లో హోంబ‌లే ఫిలిమ్స్ బ్యాన‌ర్‌పై ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ కిర‌గందూర్ నిర్మిస్తోన్న‌ భారీ బ‌డ్జెట్ చిత్రం `కె.జి.య‌ఫ్‌` చాప్ట‌ర్ 2. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ వారాహి చ‌ల‌న చిత్రం ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్ రిలీజ్ చేస్తుంది. క‌న్న‌డ చ‌ల‌న చిత్ర చ‌రిత్ర‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన `కె.జి.య‌ఫ్` రెండు భాగాలుగా రూపొందింది. `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 1ను ప్యాన్ ఇండియా చిత్రంగా క‌న్న‌డ‌, తెలుగు, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో విడుద‌ల చేశారు. ఈ సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ మూవీగా నిలిచింది. దీంతో `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ను జ‌రుపుకుంటోన్న‌ ఈ సినిమా ఫ‌స్ట్ లుక్‌ను డిసెంబ‌ర్ 21 సాయంత్రం 5:45గంట‌ల‌కు విడుద‌ల చేస్తున్నారు. అలాగే 2020లో సినిమాను విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.
బాలీవుడ్ స్టార్ యాక్ట‌ర్ సంజ‌య్ ద‌త్ ఈ చిత్రంలో అధీర అనే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టిస్తున్నారు. చాప్ట‌ర్ 1 సాధించిన విజ‌యంతో పెరిగిన అంచ‌నాల‌కు ధీటుగా ద‌ర్శ‌క నిర్మాత‌లు `కె.జి.య‌ఫ్` చాప్ట‌ర్ 2ను అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు.
రాకీ భాయ్‌గా రాకింగ్ పెర్ఫామెన్స్‌తో య‌ష్ ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌నున్నారు. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా న‌టిస్తుంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం .. భువ‌న్ గౌడ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.